
మత్తులో భవిష్యత్
ఇటీవలి ఘటనలు..
గంజాయి కిక్కులో స్టూడెంట్స్, యూత్
కాళేశ్వరం: గంజాయి మత్తులో పడి జిల్లాలోని విద్యార్థులు, యువకులు చేజేతులా బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువకులు టార్గెట్‌గా జిల్లాలో గంజాయి విక్రయాలు సాగుతుండగా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మహారాష్ట్ర గుండా జిల్లాకు చేరుతున్న గంజాయి.. జిల్లాలోని అన్ని గ్రామాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇష్టారీతిన వదిలేయడంతో..
భూపాలపల్లి, గణపురం, మహముత్తారం, కాటారం, మహదేవపూర్, కాళేశ్వరం లాంటి మండలాల్లో 13 ఏళ్ల పిల్లల నుంచి 20 ఏళ్ల యువత వరకు మద్యం, సిగరేట్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఇష్టారీతిన వదిలేయడంతో చెడుస్నేహాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. పోలీసులు పలుమార్లు కౌన్సెలింగ్‌లు ఇచ్చినా మార్పు రావడం లేదు. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యువకులు, విద్యార్థులు గంజాయికి బానిసలవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే కొందరు బాలురు గంజాయి కిక్కుకు బానిసలవుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జూలై 7న భూపాలపల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఐదుగురు వ్యక్తులు 135 కిలోల గంజాయితో పట్టుబడ్డారు.
ఐటీఐ విద్యార్థులు ముగ్గురు జూలై 23న కాళేశ్వరం వద్ద 3.31 కిలోల గంజాయితో పోలీసులకు చిక్కారు.
జూలై 26న మహాముత్తారం మండలం నుంచి భూపాలపల్లి వైపునకు బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు 6.30 కిలోల గంజాయితో పట్టుబడ్డారు.
జూలై 30న భూపాలపల్లి బస్టాండ్ వద్ద 300గ్రాముల గంజాయితో ఒకరు పట్టుబడ్డారు.
ఈనెల 11న మంథని మండలం ఎక్లాస్‌పూర్ శివారులోని గాడుదులగండి గుట్ట సమీపంలో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరితో పాటు మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి వద్ద మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో కొనుగోలు చేసిన 2.23 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.
జిల్లాలో విచ్చలవిడిగా అమ్మకాలు
యువతే టార్గెట్‌గా కోడ్ లాంగ్వేజ్
మహారాష్ట్ర గుండా జిల్లాకు..