ఈ–ఎక్స్‌ప్రెస్..బ్రేక్‌డౌన్!
బ్రేక్‌డౌన్ కారణంగా జేబీఎం కంపెనీకి చెందిన రెండు ఈ–ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులు జాతీయ రహదారిపై వేర్వేరుగా నిలిచిపోయిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వరంగల్ –2 డిపోకు చెందిన ఈ –ఎక్స్‌ప్రెస్ బస్సులు హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో హన్మకొండకు వస్తున్నాయి. ఈ–ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఒకటి రఘునాథపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే బ్రేక్‌డౌన్‌తో ముందుకు కదలక నిలిచిపోయింది. మరో బస్సు కోమళ్ల వద్ద ఆకస్మాత్తుగా ఆగిపోయింది. సాఫ్ట్‌వేర్, టెక్నికల్ లోపాలతో బ్రేక్‌డౌన్ కావడంతో అరగంటకు పైగా బస్సులు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వచ్చింది. డ్రైవర్లు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోవడంతో విషయాన్ని అధికారులకు తెలపగా.. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపాలని ఆదేశించారు. చివరకు అయా కండక్టర్లు ప్రయాణికులను ఇతర బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు పంపించారు. రఘునాథపల్లిలో మరో బస్సు కోసం అరగంటకు పైగా ప్రయాణికులు రోడ్డుపై కూర్చొని పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. – రఘునాథపల్లి


