కలెక్టరేట్‌లో ముందస్తు సంక్రాంతి
● ప్రభుత్వ సంక్షేమ పథకాలతో
ముగ్గుల పోటీలు
● కుటుంబ సభ్యులతో హాజరైన కలెక్టర్, డీసీపీ
జనగామ రూరల్: ఉత్సాహంతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వివిధ శాఖలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ సతీమణులు స్వయంగా ప్రతీ ముగ్గుని తిలకించి సంబంధిత శాఖ వారు తీసుకున్న అంశాలను వివరిస్తూ వేసిన రంగవళ్లులు వేసిన ఉద్యోగులను అభినందించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ..జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం రంగవళ్లుల పోటీలో ప్రథమ బహుమతి విద్యుత్, పంచాయతీ రాజ్, మెడికల్ అండ్ హెల్త్ శాఖ, ద్వితీయ బహుమతి వ్యవసాయ శాఖ, పోలీస్, జనగామ ప్రభుత్వ ఆసుపత్రి, తృతీయ బహుమతి పొందిన జిల్లా రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ ఉద్యోగులకు బహుమతి ప్రదానం చేశారు. స్పెషల్ బహుమతిగా కలెక్టరేట్ శానిటేషన్ సిబ్బంది ఉద్యోగులకు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, కలెక్టర్ సతీమణి డాక్టర్ సయ్యద్ ఆమ్రిన్, డీసీపీ సతీమణి సరిత, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉజ్వలతో బాలికల భవితకు భరోసా
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి పోష్ చట్టం ఎంతగానో దోహద పడుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కాన్ఫెరెన్‌న్స్ హల్‌లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పండరి చేతన్, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూవో కోదండరాములు, డీఆర్‌డీవో వసంత పాల్గొన్నారు.
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నేరం
జనగామ: లింగ ఆధారిత గర్భస్థ శిశు లింగ నిర్ధారణను అరికట్టేందుకు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పీసీ, పీఏ డీటీ చట్టం–1994 పై జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, డీఎంహెచ్‌వో డాక్టర్ మల్లికార్జున్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.


