హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలి
● జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్
పాలకుర్తి టౌన్: హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తాలో వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ సభ్యులు చిలువేరు అభిగౌడ్, సీఐ జానకిరామ్‌రెడ్డి, ఎస్సై దూలం పవన్‌కుమార్, ఏఎంవీఐ మహేశ్ గౌడ్, సర్పంచ్ విజయ, ఎంఈఓ నర్సయ్య పాల్గొన్నారు.


