ధాటిగా ఆడి..మేటిగా నిలిచి!
రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు
అశ్వరావుపల్లి విద్యార్థినులు
రఘునాథపల్లి: మండలంలోని అశ్వరావుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్యారాల కావ్యశ్రీ, శివరాత్రి అక్షయ, వరికుప్పుల మానస రాష్ట్రస్థాయి జూనియర్ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం శోభన్‌బాబు, పీఈటీ రాజేందర్ గురువారం తెలిపారు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని అద్బుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 9,10,11 తేదీల్లో నిజామాబాద్ ఆర్మూర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు
లింగాలఘణపురం: ఈనెల 18న ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు మండలంలోని వనపర్తి ఉన్నత పాఠశాలలోని 7వ తరగతి విద్యార్థిని సుంచు దీక్షత ఎంపికై నట్లు ఎంఈఓ విష్ణుమూర్తి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో దీక్షిత షార్ట్‌పుట్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. విద్యార్థిని దీక్షితను ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు అభినందించారు.
పల్లగుట్ట విద్యార్థులు..
చిల్పూరు: 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు పల్లగుట్ట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం విజయ్‌కుమార్, వ్యాయామ విద్యా దర్శకులు దేవ్‌సింగ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన 12, 14 సంవత్సరాల బాలబాలికల త్రియతలాన్ పోటీల్లో 6వ తరగతి చదువుతున్న కుంచాల వికాస్, 9వ తరగతి చదువే జీడి ప్రీతి ప్రథమ స్థానంలో నిలిచి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌కు ఎంపికయ్యారన్నారు. 18న ఆదిలాబాద్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్
పోటీలకు ఎంపిక
పాలకుర్తి టౌన్: జాతీయస్ధాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలకు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన బాలబోయిన స్మైలిక ఎంపికై ంది. గత నెల 21, 22, 23 తేదీల్లో మెదక్ జిల్లాలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం మనోహరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్థాయి బాలికల సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్‌లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై ంది. ఈనెల 9,10,11న హరియానాలో జరిగే జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది.
జిల్లా విద్యార్థులు ఆటల్లో ప్రతిభ చాటుతున్నారు. పలు క్రీడాంశాల్లో వివిధ స్థాయిల్లో సత్తా చాటి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయికి ఎంపికవుతున్నారు. ఈనేపథ్యంలో గురువారం పలువురు విద్యార్థులు వివిధ స్థాయిలకు ఎంపికయ్యారు.
కావ్యశ్రీ, అక్షయ, మానస
ధాటిగా ఆడి..మేటిగా నిలిచి!
ధాటిగా ఆడి..మేటిగా నిలిచి!
ధాటిగా ఆడి..మేటిగా నిలిచి!


