మొదలుకాని ఏర్పాట్లు
మరో 20రోజుల్లో సమ్మక్క సారలమ్మ జాతర
మినీ జాతరలు..
అమ్మాపురంలో అమ్మవారి గద్దెలు
జనగామ రూరల్: తెలంగాణ వనదేవతలు శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర మరో మూడు వారాల్లో ప్రారంభం కానుండగా, జిల్లాలోనూ పలు చిన్న జాతరలు(మినీ మేడారాలు) నిర్వహించనున్నారు. ఈ జాతరలకు సైతం భక్తులు వందలు, వేలు, లక్షల్లో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జిల్లాలో 5 మండలాల పరిధిలో చిన్నజాతరలు జరుగుతాయి. భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా.. చిన్న జాతరల పనులపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జాతర ఏర్పాట్లు, సమస్యలు, వసతుల కల్పనపై ‘సాక్షి’ ప్రత్యేక ఫోకస్..
స్టేషన్ ఘన్‌పూర్ మండల పరిధిలో ఇప్పగూడెం, రంగరాయగూడెం, అక్కపెళ్లిగూడెం, కోమటిగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో శ్రీ చింతగట్టు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మండలంలోని తాటికొండ, జిట్టగూడం గ్రామపంచాయతీల పరిధిలో మల్లన్నగండి వద్ద జాతర కూడా జరుగుతుంది. ఇందులో ఇప్పగూడెం జాతర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, తాటికొండను జాతర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 20 రోజుల్లో జాతర ప్రారంభం కానుండగా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. తాటికొండ జాతరకు ఇప్పటికే టెండర్లు పూర్తికాగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పగూడెం జాతరలో ఇంతవరకూ టెండర్లు సైతం కాలేదు. జాతరకు వచ్చే భక్తులకు రోడ్లు, తాగునీరు చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు తదితర సౌకర్యాలు చేపట్టాల్సి ఉంది. రెండు జాతరాలకు వెళ్లే రోడ్లు గుంతలమయంగా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లకు ఇరువైపులా పిచ్చిచెట్లు, కంపచెట్లు ఏపుగా పెరిగి మూలమలుపుల వాహనాలు కనిపించకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పగూడెం జాతరకు దాదాపు రెండు లక్షల వరకు భక్తులు తరలిరానుండగా, తాటికొండ జాతరకు లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.
నర్మెట మండలం అమ్మాపురంలోని సమ్మక్క సారలమ్మ జాతర గద్దెల ప్రాంగణానికి వెళ్లే రోడ్డు ఇబ్బంది కరంగా ఉంది. జాతర స మయంలో వందలాది మందికి పైగా హాజరై మొక్కులు చెల్లించు కుంటారు. ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అలాగే బచ్చన్నపేట మండలంలోని మనసాన్‌పెల్లి గ్రామంలో సమ్మక్క సారల మ్మ గద్దెల వద్ద ఎలాంటి పనులు చేపట్టలేదు. పిచ్చి మొక్కలతో నిండి రహదారి అధ్వానంగా ఉంది.
జఫర్‌ఘడ్ మండల కేంద్రంలో సమ్మక్క బండపై వెలసిన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు దారి సౌకర్యం లేదు. పూర్వంలో ఇదే బండ వద్ద సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పటికీ ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. రెండేళ్ల నుంచి భక్తులు వనదేవతలను పునప్రతిష్టించడంతో పాటు చుట్టూ గద్దెను నిర్మించారు. అయితే గద్దెల వద్దకు వెళ్లేందుకు దారి సౌకర్యం లేదు. దారి సౌకర్యంతో పాటు విద్యుత్ దీపాలు, నీటి వసతి, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడంతోపాటు భక్తుల సౌకర్యార్థం గద్దెల ముందు బండపై సీసీ నిర్మాణం చేపట్టాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.
జిల్లాలో 5 మండలాల్లో చిన్నజాతరలు
ఇప్పటికీ ఎక్కడా ప్రారంభం కాని ఏర్పాట్లు
లింగంపల్లి, ఇప్పగూడెం జాతరలకు
రెండు లక్షలకుపైగా భక్తులు
వసతులపై అధికారులు
దృష్టిసారించాలంటున్న భక్తులు
మొదలుకాని ఏర్పాట్లు
మొదలుకాని ఏర్పాట్లు
మొదలుకాని ఏర్పాట్లు
మొదలుకాని ఏర్పాట్లు


