లక్షల్లో భక్తులు..ఇప్పుడిప్పుడే పనులు
చిల్పూర్ మండలంలో మూడు చిన్న జాతరలు నిర్వహిస్తున్నారు. లింగంపల్లి జాతరను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో మినీ మేడారంగా పేరొందింది. గతేడాది మూడు లక్షల పైగా భక్తులు హాజరయ్యారు. శ్రీపతిపల్లి, కొండాపూర్ రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న జాతరకు దాదాపు రెండు లక్షల వరకు భక్తులు హాజరవుతారు. ప్రస్తుతం నూతన కమిటీ ద్వారా ఇప్పుడిప్పుడే పనులు మొదలుపెట్టారు. గార్లగడ్డ తండాలో ఏర్పాటు చేసిన జాతర గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. జాతరకు కనీసం దారి సౌకర్యం కూడా లేదు.


