ఆక్రమించి.. సాగుచేసి | - | Sakshi
Sakshi News home page

ఆక్రమించి.. సాగుచేసి

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

● మెట్‌పల్లి మండలంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ● ఖాళీ స్థలం ఉండి అందులో ప్రభుత్వ భూమి అని తెలిస్తే చాలు.. ఆ ప్రాంతాన్ని రాత్రికి రాత్రే ఆక్రమించేస్తున్నారు. ● అర్ధరాత్రి సమయంలో యంత్రాలతో చదును చేస్తూ సొంత భూమి అన్నట్లు హద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ● మరోవైపు ఆక్రమించిన భూములపై ఏమైనా వివాదాలు ఏర్పడే అవకాశం ఉందా..? లేదా..? గ్రామస్తులు ఏమైనా ఫిర్యాదు చేశారా..? అని తెలుసుకుంటున్నారు. ● కార్యాలయాల్లో తమకు సన్నిహితంగా ఉండే కిందిస్థాయి సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతధికారుల తీరుపై సమాచారం తెలుసుకుంటున్నట్లు తెలిసింది. ● ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిస్తే పంటలు సాగు చేయడం..లేదా ఆ భూములను ఇతరులకు సాగు చేసుకోవాలని కౌలుకు ఇవ్వడం గమనార్హం. ● మరికొందరు అక్రమార్కులు వారి సాగు భూముల పక్కనే పట్టా భూములు ఉన్నా.. ఎకరాల కొద్ది కలిపేసుకుంటున్నారు.

మెట్‌పల్లిరూరల్‌: జిల్లాలోని ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. రెవెన్యూ, అటవీ, ఎస్సారెస్పీ భూములను అడ్డుఅదుపులేకుండా ఆక్రమించి అందులో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆయా స్థలాలకు హద్దులు లేకపోవడంతో ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వందలాది ఎకరాల అన్యాక్రాంతమవుతున్నా కాపాడే వారు లేకపోవడం ఆక్రమణదారులకు కలిసి వస్తోంది. భూ ఆక్రమణలపై ఏదైనా ఫిర్యాదు వస్తే ఆ సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుంటున్న అధికారులు విచారణకే పరిమితమవుతున్నారు. విచారణలో ఆక్రమణలకు పాల్పడిన వారి వివరాలు తెలిసినప్పటికీ.. వారిపై ఎలాంటి చర్యలకూ ఉపక్రమించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

ఖాళీ స్థలం కనిపిస్తే చాలు..

విచారణకే పరిమితం..

మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌, రంగారావుపేట, ఆత్మకూర్‌, తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వీటిపై అదేస్థాయిలో అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేస్తున్నారు. కానీ బహిర్గతమైన విషయాలపై దృష్టి సారించడంలేదు. వెరసి ఆక్రమణదారులు రెచ్చిపోవడం.. ప్రభుత్వ భూములు కనుమరుగైపోవడం పరిపాటిగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మెట్‌పల్లి మండలం మెట్లచిట్టాపూర్‌ శివారులో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాదాపు 50 ఎకరాల వరకు భూమి కబ్జాకు గురైనట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఈ ఒక్క గ్రామంలోనే కాదు.. దాదాపు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లు అధికారులకు వరుస ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం.

ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

హద్దులు లేకపోవడంతో అడ్డూఅదుపులేకుండా కబ్జా

ఆక్రమణల్లో రెవెన్యూ, అటవీ, ఎస్సారెస్పీ భూములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement