తిరుపతి–కరీంనగర్‌ రైలు వేళల్లో మార్పు | - | Sakshi
Sakshi News home page

తిరుపతి–కరీంనగర్‌ రైలు వేళల్లో మార్పు

Aug 8 2026 1:23 AM | Updated on Aug 8 2026 1:23 AM

రామగుండం: తిరుపతి – కరీంనగర్‌ మధ్య నడిచే బై వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(12761) వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి నుంచి రాత్రి 8.05 గంటలకు బయలుదేరాల్సిన రైలు ఇకనుంచి 7.50గంటలకేల బయలుదేరనుందని, అక్టోబర్‌ 10వ తేదీ నుంచి ఇది అమలులోకి వస్తుందని వివరించారు. ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.

తీర్థ యాత్రల ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

విద్యానగర్‌(కరీంనగర్‌): బోనాల పండుగా సందర్భంగా హైదరాబాద్‌లోని ఆలయాల దర్శనం కోసం ఈనెల 9 ఆదివారం ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ లగ్జరీ బస్సు సర్వీస్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ కరీంనగర్‌–1 డిపో మేనేజర్‌ ఐ. విజయమాధురి తెలిపారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి ఈ బస్సు సర్వీసు బయలుదేరి నిమిషాంబిక టెంపుల్‌, అష్టలక్ష్మి టెంపుల్‌, పెద్దమ్మ టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, జగన్నాథ టెంపుల్‌, చిలుకూరు బాలజీ టెంపుల్‌ సందర్శన అనంతరం అదే రోజు రాత్రి కరీంనగర్‌ చేరుతుందని ఆమె పేర్కొన్నారు. పెద్దలకు రూ.1300, పిల్లలకు రూ.975 టికెట్‌ ఉంటుందని వివరించారు. వివరాలకు 73828 49352, 9959225920 ఫోన్‌ నెంబర్లలో సందప్రదిచాలని సూచించారు.

బావిలోపడి వృద్ధురాలి మృతి

సుల్తానాబాద్‌రూరల్‌: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన అసరి మల్లమ్మ(83)శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోపడి మృతి చెందింది. ఎస్సై చంద్రకుమార్‌ కథనం ప్రకారం.. మల్లమ్మకు నాలుగేళ్లుగా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో అటుఇటు తిరుగుతుండేది. శుక్రవారం ఇంటిసమీపంలోని వ్యవసాయబావి వైపు వెళ్లాగా అందులో ప్రమాదవశాస్తు పడి మృతి చెందింది. ఆమె కొడుకు రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్‌

మల్యాల: నకిలీ ఇంటి పన్ను రశీదు తయారు చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్సై సందీప్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మల్యాల మండలం సర్వాపూర్‌ గ్రామానికి చెందిన ఆకుల నగేశ్‌, బాసోజి అనిల్‌, అరుణ్‌ సర్వాపూర్‌ గ్రామ పంచాయతీకి చెందిన నకిలీ రశీదును తయారు చేశారు. అధికారిక రబ్బర్‌ స్టాంపులు, ముద్రలతో ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. మండల పంచాయతీ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిని అరెస్టు చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.

అదృశ్యమైన బాలిక బంధువులకు అప్పగింత

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం కండ్లపల్లి గ్రామంలోని మోడల్‌స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 5న అదృశ్యం కాగా, తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేసి సీసీ పుటేజీ ఆధారంగా బాలిక మధ్యప్రదేశ్‌ వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో మఽ ద్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌లో బాలికను గుర్తించి జగిత్యాలలో ఉన్న కు టుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించారు. మ ధ్యప్రదేశ్‌, జగిత్యాల రూరల్‌ పోలీసుల సమన్వయంతో బాలిక ను గ్వాలియర్‌ జిల్లా వా చిపుర గ్రామానికి చెందిన పెద్దనాన్న బల్వీర్‌కు అప్పగించారు. బాలికను తల్లిదండ్రుల వద్దకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

పెద్దపల్లి: పేదలకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని పెద్దపల్లికి చెందిన పలువురు పౌరులు కలెక్టర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 6న రాత్రి ఎల్లమ్మ చెరువు ప్రాంతంలో సుమారు 35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా అడ్డుకుని తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. అయినా, వారు స్పందించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం డయల్‌ 100 నంబరుకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యం లోడుతో ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వారు తెలిపారు. పట్టుబడిన బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement