ముత్తారం: పెద్దపల్లి జల్లా ముత్తారం మండలం కేశనపల్లిలో శుక్రవారం ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొన్న ప్రమాదంలో భవన నిర్మాణ రంగ కూలీ అక్కడకక్కడే మృతి చెందాడు. గోదావరిఖనికి చెందిన జాడి రాజేందర్ ముత్తారంలో ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణంలొ పనిచేయడానికి వచ్చాడు. ముత్తారం నుంచి గోదావరిఖనికి తిరుగు ప్రయాణంలో కేశనపల్లి వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర డీసీఎం వ్యాన్‌ను ఢీకొని చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సుధాకర్ తెలిపారు.


