అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

Aug 8 2026 1:23 AM | Updated on Aug 8 2026 1:23 AM

బోయినపల్లి(చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులతో బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన బొటుకు మహేశ్‌(34) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ తెలిపిన వివరాలు. మహేశ్‌ కూలీ పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. మహేశ్‌ తండ్రి నందయ్య గతంలో మృతిచెందాడు. కొద్ది నెలులుగా అప్పులు ఎక్కువ అయ్యాయి. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు భరించలేక తన ఇంట్లోనే దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేశ్‌కు భార్య నవ్య, ఇద్దరు కుమారులు లోకేశ్‌(6), అశ్విత్‌(4) ఉన్నారు. మృతుడి తల్లి బొటుకు లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement