మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో ప్రధానమైన పెద్ద చెరువును సుందరీకరించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో ఎనిమిది మీటర్ల వెడల్పు, సుమారు రెండు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్‌కు అనుకూలంగా ఉండేలా కట్టను నిర్మించారు. నీటి ప్రవాహానికి కట్ట కోతకు గురి కాకుండా ఇరువైపులా రాళ్లతెట్ట ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ మరికొన్ని పనుల కోసం కేంద్రప్రభుత్వ అమృత్ 2.0 పథకం కింద సుమారు రూ.3కోట్లు కేటాయించింది. జంగిల్ క్లియరెన్స్, కట్ట నిర్మాణం, లైటింగ్, యోగాకేంద్రం వంటి పనులు చేపట్టాల్సి ఉంది.
ఎన్‌ఓసీ పొందకుండానే..
కట్టకు గండితో మత్స్యకారులకు నష్టం
అటు నోటీసు..ఇటు పోలీసులకు ఫిర్యాదు
అమృత్ నిధులతో పెద్ద చెరువు సుందరీకరణకు శ్రీకారం
జల వనరుల శాఖ అనుమతి లేకుండానే పనుల కొనసాగింపు
నిబంధనలు పట్టించుకోని పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు
మత్తడి తొలగించి కట్ట ఏర్పాటుపై విమర్శలు
చెరువుకు గండి కొట్టడంపై పోలీసులకు ఫిర్యాదు
మౌఖిక అనుమతితో పనులు
చెరువు వద్ద కట్ట నిర్మాణానికి జల వనరుల శాఖ అధికారులు ఎనోవోసీ ఇవ్వడం కుదరదన్నారు. వారు మౌఖికంగా ఇచ్చిన అనుమతితో పనులు మొదలుపెట్టాం. వచ్చిన నిధులు లాప్స్ అయ్యే అవకాశం ఉండడంతో గత్యంతరం లేక పనులు ప్రారంభించాం. మత్తడి స్థానంలో ఏర్పాటు చేసిన కట్టను తొలగిస్తాం. అక్కడ తిరిగి మత్తడి నిర్మిస్తాం.
– నాగేశ్వర్‌రావు, మున్సిపల్ డీఈ
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం
మత్తడి స్థానంలో ఏర్పాటు చేసిన కట్టకు గండి కొట్టిన విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. గండి కొట్టడం ద్వారా మత్స్యకారులకు నష్టం జరిగింది. విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాం.
– అనురాగ్, ఏఈ, జలవనరుల శాఖ


