జగిత్యాల: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం అధికారులతో సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, పాఠశాల భవనాలు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఓపెన్ స్కూల్ సువర్ణావకాశం
పాఠశాల స్థాయిలో చదువుకు దూరమై.. చదువుకోవాలని ఉన్న యువతకు ఓపెన్‌స్కూల్ మంచి అవకాశమని కలెక్టర్ అన్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరపత్రాన్ని ఆవిష్కరించారు. డీఈవో రాము, ఓపెన్ స్కూల్ సొసైటీ ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ రామడుగు రవీందర్, నక్క రాజు, రవీందర్ పాల్గొన్నారు.
టెట్ మెటీరియల్ వినియోగించుకోవాలి
టెట్ మెటీరియల్ వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. స్టేట్ టీచర్స్ యూనియన్ రూపొందించిన టెట్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరించారు. 2028 ఆగస్టు 31 లోపు ఉపాధ్యాయులు టెట్ పాస్ అవ్వడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మెటీరియల్ రూపొందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, శివ రామకృష్ణ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్, ఉపాధ్యక్షుడు రవీందర్, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ ఉన్నారు.
ప్లాస్లిట్ వ్యర్థాల యూనిట్ పనులు పరిశీలన
మల్యాల: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణతో పర్యావరణ పరిరక్షణ మెరుగుపడుతుందని కలెక్టర్ అన్నారు. మల్యాలలో మల్యాల, కొడిమ్యాల, పెగడపల్లి మండలాలకు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్‌ను గురువారం పరిశీలించారు. యూనిట్ ఏర్పాటుకు అవసరమైన యంత్రాలను కొనుగోలు చేయాలని, పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. బేలింగ్ యంత్రం, ష్రెడర్ యంత్రం, లిఫ్టింగ్ కార్ట్, వేయింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమన్నారు. ఎంపీడీవో స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచులు బొట్ల జయప్రసాద్, బల్మూరి పాపారావు, పీఆర్ అధికారులు, ఆర్‌ఐ తిరుపతి, రాణి, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్


