జయశంకర్‌ ఆలోచన.. కేసీఆర్‌ ఉద్యమంతోనే రాష్ట్ర సాధన | - | Sakshi
Sakshi News home page

జయశంకర్‌ ఆలోచన.. కేసీఆర్‌ ఉద్యమంతోనే రాష్ట్ర సాధన

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

జగిత్యాలటౌన్‌: జయశంకర్‌ ఆలోచన, కేసీఆర్‌ ఉద్యమంతోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని కరీంనగర్‌ రోడ్డులోగల ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. జయశంకర్‌ ఆలోచనలే తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేశాయన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అయిల్నేని వెంకటేశ్వర్‌రావు, వొల్లం మల్లేశం, కోరుకంటి రాము, తోట హరీష్‌, గాజుల రాజేందర్‌, దుర్గయ్య, రమేశ్‌ రావు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తొగిటి గంగాధర్‌, ఇల్లెందుల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ముందుగా సామాజిక సమరసత జిల్లా అధ్యక్షుడు చిట్ల గంగాధర్‌ తదితరులు జయశంకర్‌కు నివాళి అర్పించారు.

జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement