విద్యార్థులు కష్టపడి చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు కష్టపడి చదవాలి

Aug 6 2026 2:20 AM | Updated on Aug 6 2026 2:20 AM

కోరుట్లరూరల్‌:విద్యార్థులు ఉన్నత లక్ష్యాల సాధనకు కష్టపడి చదవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. మండలంలోని మాదాపూర్‌, మోహన్‌రావుపేట ఉన్నత పాఠశాలలు, పట్టణ శివారులోని బీసీ వెల్ఫేర్‌ గురుకులాన్ని బుధవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి క్రమశిక్షణతో చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తేవాలన్నారు. హెచ్‌ఎం, బీఆర్‌ఎస్‌ నాయకులు దారిశెట్టి రాజేష్‌, సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement