ముందస్తు చర్యలు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు చర్యలు చేపట్టండి

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలి పునరావాస కేంద్రాలను సిద్ధంగా ఉంచాలి కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల/ఇబ్రహీంపట్నం: భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌ సరఫరాపై నిరంతర పర్యవేక్షించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. గురువారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, బల్దియా కమిషనర్లతో సమావేశమయ్యారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, గోదావరి నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముంపునకు గురయ్యే గ్రామాలు, కాలనీల్లో పర్యటించాలని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాలను గుర్తించి విద్యుత్‌, ఆహారం, వైద్యం, పారిశుధ్యం సక్రమంగా ఉంచాలన్నారు. నాలాలు బ్లాక్‌ కాకుండా చూడాలని బల్దియా కమిషనర్లను ఆదేశించారు.

హెచ్చరిక బోర్డులు తప్పనిసరి

అనంతరం కలెక్టర్‌ ఇబ్రహీంపట్నం మండలం యామపూర్‌, ఫకీర్‌కొండాపూర్‌ మధ్య తెగిపోయిన తాత్కాలిక రోడ్డును ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. వాగుల్లో ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులకు సూచించారు. యామపూర్‌, ఫకీర్‌కొండాపూర్‌ మధ్య నిలిచిపోయిన బ్రిడ్జి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకొవాలని యామపూర్‌ సర్పంచు నాగయ్య కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఆయన వెంట డీఎస్పీ రాములు, తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీడీవో గణేష్‌, ఎంపీవో రామకృష్ణరాజు, ఫకీర్‌కొండాపూర్‌ సర్పంచ్‌ తోట రమేశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement