జగిత్యాలరూరల్: ఇళ్లు కూలిపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత కోరారు. సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్ గ్రామాల్లో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. అదే గ్రామంలో ఇల్లు కూలిపోయిన పస్తం స్వప్న, పరమేశ్, దుర్గేశ్ ఇళ్లను పరిశీలించారు. ఆర్డీవో, తహసీల్దార్లతో ఫోన్లో మాట్లాడి బాధితులకు పరిహారం అందించాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు శ్రీనివాస్, అలీం, జనార్దన్, వెంకటేశ్, వేణు, మల్లయ్య పాల్గొన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొరండ్లకు చెందిన సింగారపు రవి ఇల్లు బుధవారం రాత్రి కూలిపోగా వారి కుటుంబాలను దావ వసంత పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆనందరావు, నాయకులు గంగారెడ్డి, తోట మహేశ్, శేఖర్, మల్లేశంగౌడ్, లింగయ్య, సన్నిత్, చందు, రాము పాల్గొన్నారు.


