కరీంనగర్ రూరల్: తీగలగుట్టపల్లిలో జరిగిన రూ.26 లక్షల నగదు చోరీ కేసులో మరో నిందితురాలు ఆడెపు రేష్మాను గురువారం కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు తగరం శంకర్‌ను రిమాండ్‌కు తరలించారు. తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్‌లో అనుమానస్పదంగా సంచరిస్తున్న రేష్మాను అదుపులోకి తీసుకున్నారు. శంకర్‌తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్‌లో ప్లాస్టిక్‌డ్రమ్‌లో దాచిన సుమారు రూ.26 లక్షల నగదును అపహరించినట్లు అంగీకరించింది. శంకర్‌ను అరెస్ట్ చేయడంతో భయపడిన రేష్మా చంద్రాపూర్ వెళ్లేందుకు గురువారం రైల్వేస్టేషన్‌కు రావడంతో పట్టుకున్నారు. కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.


