తాత్కాలిక మరమ్మతులతోనే సరి | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక మరమ్మతులతోనే సరి

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

● వర్షాలకు కొట్టుకుపోతున్న కాజ్‌వేలు ● రూ.52 కోట్టు మంజూరైనట్లు ప్రకటించిన గత ప్రభుత్వం ● పనులు మొదలు కాకముందే నిధులు వె నక్కి ● ఏటా తప్పని రవాణా తిప్పలు

కోనరావుపేట: మండలంలోని మూలవాగుపై గతంలో నిర్మించిన కాజ్‌వేలు భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో రవాణా కష్టాలు ఎదురవుతున్నాయి. కాజ్‌వేల స్థానంలో వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరైనా ప్రారంభానికి నోచుకోవడంలేదు. మండలంలోని మామిడిపల్లి–నిజామాబాద్‌, వెంకట్రావుపేట – బావుసాయిపేట, వట్టిమల్ల – నిమ్మపల్లి మధ్య ఉన్న మూలవాగుపై రవాణా కష్టాలు నిత్యకృత్యమవుతున్నాయి. వర్షాలు పడితే మూలవాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయి, సంబంధాలు తెగుతున్నాయి. పలుగ్రామాల ఇబ్బందులపై అప్ప టి నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మూడు వంతెనలు మంజూరుచేశా రు. ఐదేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈవంతెనలు కొట్టుకుపోయి, మళ్లీ రవాణా వ్యవస్థ దెబ్బతింది. స్థానిక పాలకులు తాత్కాలిక మరమ్మతులు చేపట్ట డం, వర్షాలకు కొట్టుకుపోవడం పరిపాటి అయింది.

రద్దయిన రూ.52 కోట్ల నిధులు..

గత కొన్నేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా త ప్రభుత్వం ఈవంతెనల నిర్మాణానికి రూ. 52 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించినా టెండర్లు అవుతున్నాయని చెప్పిన అధికారులు ఆ నిధులన్నీ రద్దయ్యాయని తెలుపుతున్నారు. తమ రవాణా కష్టాలు తప్పవని గ్రామీణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement