జగిత్యాలఅగ్రికల్చర్: అల్పపీడన ప్రభావంతో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్ల నుంచి నుండి బయటకు వెళ్లలేకపోయారు. బీర్‌పూర్ మండలం కొల్వాయిలో 146.8 మి.మీ వర్షం నమోదైంది. ఎండపల్లి మండలం గుల్లకోటలో 108.8, వెల్గటూర్‌లో 107.5, సారంగాపూర్‌లో 105.8, బుగ్గారం మండలం సిరికొండలో 104.3, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 101.3, గొల్లపల్లిలో 81, మల్యాలలో 80.5, జగిత్యాల రూరల్ మండలం పొలాసలో 79.8, రాయికల్ మండలం అల్లీపూర్‌లో 79.5, మెట్‌పల్లిలో 78.5, కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌లో 73, మల్లాపూర్‌లో 72.8, మేడిపల్లిలో 68, జగిత్యాలలో 64, కథలాపూర్‌లో 56.3, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 55.3, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 53.5, పెగడపల్లిలో 53.5, భీమారం మండలం గోవిందారంలో 52 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఎస్సారెస్పీకి 72,452 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు ఎగువ ప్రాంతాల నుంచి 72,452 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. అవుట్ ఫ్లో 751 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో 18.131 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కెనాల్‌కు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కడెం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి వదిలారు.


