కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం

Jul 31 2026 2:03 AM | Updated on Jul 31 2026 2:03 AM

10అంశాలపై ఏకగ్రీవ తీర్మాణం

రాయికల్‌ బల్దియా సాధారణ సమావేశం

రాయికల్‌: రాయికల్‌ పట్టణాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ చైర్మన్‌ కట్కం రవి అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో వార్డుల్లో నీటిని తొలగించేందు కు మోటార్లను వినియోగిస్తామని, అవసరమైన చోట్లలో జేసీబీలతో పారిశుధ్య పనులు చేపడతామ ని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల కాంట్రాక్టు పొందిన కొందరు పనులు చేపట్టడం లేదని కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకెళ్లగా.. వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ మనోహర్‌గౌడ్‌ను ఆదేశించారు. పట్టణంలో తైబజార్‌ పెట్టకపోవడంతో మున్సిపల్‌ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని కౌన్సిల్‌లో చర్చించారు. అనంతరం 11 అంశాలకు గాను 10 అంశాలను ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, రాకేశ్‌నాయక్‌, వేముల మౌనిక, పల్లికొండ గంగాధర్‌, పుర్రె శ్రీధర్‌, కల్లెడ చిన్నధర్మపురి, కో–ఆప్షన్‌ సభ్యులు వల్లకొండ మహేశ్‌, సుదవేని లత, ఇర్ఫాన్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement