రైస్‌మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారుల తనిఖీ

Jul 31 2026 1:51 AM | Updated on Jul 31 2026 1:51 AM

జగిత్యాలక్రైం: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ విజి లెన్స్‌ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. గురువారం ఉదయం జిల్లాలో మూడు రైస్‌మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. జిల్లాకు చెందిన రైస్‌ మిల్లర్లు ఇటీవల ప్రభుత్వం టెండర్ల ద్వారా విక్రయించిన ధాన్యం తీసుకుని డబ్బులు జా ప్యం చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్‌ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

తాళం వేసిన ఇంట్లో చోరీకి యత్నం

జగిత్యాలక్రైం: పట్టణంలోని హౌసింగ్‌బోర్డు రామాలయం వెనుక తాళం వేసి ఉన్న కడారి సత్యనారాయణరావు ఇంట్లో గుర్తుతెలియని దొంగలు చోరీకి యత్నించారు. సత్యనారాయణరావు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పని నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. రాత్రి గుర్తుతెలియని దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చోరీకి యత్నించారు. గురువారం మధ్యాహ్నం స్థానికులు బాధితుడికి సమాచారం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. దొంగతనం జరిగిన ప్రాంతాల్లో ఫింగర్‌ప్రింట్స్‌ సేకరించారు.

స్వగ్రామానికి యువకుడి మృతదేహం

చొప్పదండి: దేశాయిపేట గ్రామానికి చెందిన పులిపాక బాబు(30) ఇటీవల దుబాయిలో మృతిచెందగా.. గురువారం మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. కొన్నేళ్లుగా బాబు దుబాయికి వెళ్తున్నాడు. అక్కడ జూలై 7న గుండె సంబంధిత అనారోగ్యంతో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి పెళ్లి కాలేదు. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబుకు సోదరి ఉందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

జేఎన్టీయూలో ‘రెడ్రాబ్‌’ ఉచిత శిక్షణ

కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ రె డ్రాబ్‌ ఏఐ శిక్షణ ఇచ్చేందుకు గురువారం ఒ ప్పందం కుదుర్చుకుంది. విద్యార్థులు, అధ్యాపకులు, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ విభాగానికి ఆర్నెళ్లపాటు రెడ్రాబ్‌ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులకు ఏఐ ఆధారిత రెజ్యూమ్‌ బిల్డింగ్‌, జాబ్‌ మ్యాచింగ్‌, ఇంట ర్వ్యూ ప్రిపరేషన్‌, ఉ ద్యోగార్హత స్కోరింగ్‌ వంటి సేవలు అందుబా టులోకి రానున్నాయి. అధ్యాపకులకు పరిశోధ న, అసెస్‌మెంట్‌ రూపకల్పన, ప్లేస్‌మెంట్‌ అధి కారులకు హెచ్‌ఆర్‌ బృందాలతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాల పూర్తిస్థాయి ‘ఏఐ రెడీ క్యాంపస్‌’గా రూపుదిద్దుకోనుందని కళాశాల ప్రిన్సిపాల్‌ నరసింహ, ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ బి.సతీశ్‌ కుమార్‌ తెలిపారు.

వర్షానికి కూలిన ఇల్లు

ఫెర్టిలైజర్‌సిటీ: రామగుండం కార్పొరేషన్‌ 21 డివిజన్‌ వీర్లపల్లిలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జంజిరాల నరసమ్మకు చెందిన రేకుల షెడ్డు పూర్తిగా కూలిపోయింది. భర్త శంకరయ్య మృతి చెందడంతో ఒంటరిగానే జీవిస్తోంది. కొడుకు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నాడు. ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ రోదిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement