వట్టిమల్ల నుంచి నిమ్మపల్లికి, కోనరావుపేట మండలకేంద్రానికి వెళ్లాలంటే ఇదే మూలవాగు పైనుంచే వెళ్లాలి. వాగుపై గతంలో నిర్మించిన వంతెన కొట్టుకుపోయింది. తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నా వర్షాలకు మళ్లీ కొట్టుకుపోతుండడంతో రవాణాకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలి. – గుండా వెంకటేశ్, వట్టిమల్ల సర్పంచ్
రవాణాకు ఇబ్బంది
మండలంలోని మూలవాగుపై వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన రాహిత్యంతో ఎస్‌డీఎఫ్ నిధులను రద్దు చేశారు. దీంతో ఏటా వర్షాకాలంలో రవాణాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పటికై నా వంతెనల కోసం నిధులు మంజూరు చేయాలి.
–బడుగు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మామిడిపల్లి


