రహదారులపై పడిపోయిన చెట్లు | - | Sakshi
Sakshi News home page

రహదారులపై పడిపోయిన చెట్లు

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

రాకపోకలకు తీవ్ర ఇబ్బంది

తొలగించిన పోలీసులు

జగిత్యాలక్రైం: ఈదురుగాలులకు జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై బుధవారం రాత్రి చెట్లు కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బుగ్గారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గంగాపూర్‌లో రహదారిపై చెట్టు కూలిపోగా తొలగించి రాకపోకలను క్లియర్‌ చేశారు. పెగడపల్లి–రామడుగు రహదారిపై చెట్టు కూలిపోగా బ్లేడ్‌ ట్రాక్టర్‌ సహాయంతో తొలగించారు. కొండగట్టు మండలం రాజారం సమీపంలో రెండు చెట్లు కూలిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, చెట్లు కూలిపోయినా.. విద్యుత్‌ స్తంభాలు లేదా ఇతర అడ్డంకులు కనిపిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌, లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement