22 ఏళ్లు సర్పంచ్.. శంకరయ్య
కథలాపూర్(వేములవాడ): ప్రజాప్రతినిధిగా హోదా రా వాలని ఎన్నికల వేళల్లో నేతలు పడరాని పాట్లు పడుతుంటారు. పదవి వచ్చాక ప్రజ లకు సేవలందించి రెండోసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే వారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కానీ కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన ఆమందు శంకరయ్య 22 ఏళ ్లపాటు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అంబారిపేటలో 1959లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామస్తులందరూ సమావేశమై శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి సర్పంచ్‌గా శంకరయ్యనే. ఇలా 1981 వరకు శంకరయ్య సర్పంచ్‌గా సేవలందించారు. ఇలా ఏకధాటిగా 22 ఏళ్లు సర్పంచ్‌గా పనిచేసి అదీ ఏకగ్రీవంగానే ఎన్నిక కావడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయనను అంబారిపేట శంకరయ్యగా పిలిచే వారని అతని మిత్రులు, నాయకులు తెలుపుతున్నారు. 2014లో శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.


