● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: నేటి యువతే దేశానికి సంపద అని, యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏటీసీ సెంటర్‌లో మరో ఆరు కోర్సులను ప్రారంభించారు. యువత ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశంతో టాటా కంపెనీతో కలిసి ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించామన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ వినియోగించుకోవాలి
సీఎంఆర్‌ఎఫ్ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని 42వ వార్డుకు చెందిన వెంకటేశ్‌కు రూ.2లక్షలు, గాంధీనగర్‌కు చెందిన లక్ష్మయ్యకు రూ.2లక్షల విలువైన చెక్కులు అందించారు.
హైమాస్ట్ లైట్లు ప్రారంభం
జిల్లాకేంద్రంలోని ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి ఉన్నారు.
ముస్లింలకు ఇఫ్తార్
జగిత్యాలలోని జమాత్ ఏ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయగా.. ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఫజల్ బేగ్, ఖాలిద్, సోయబ్ ఉల్ హక్, హరికిరణ్‌రావు, దామోదర్‌రావు ఉన్నారు.
ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా చేపట్టాలి
జగిత్యాల: ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. జూన్ 12వరకు పకడ్బందీగా అమలు చేయాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. పారిశుధ్యం, ఫైల్స్ క్లియరెన్స్‌పై దృష్టి సారించాలన్నారు. 12న మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీపీఆర్వో నరేశ్, డీపీవో మదన్‌మోహన్ పాల్గొన్నారు.


