రాయికల్: బల్దియాలోని ప్రైవేటు భూములు అపరి శుభ్రంగా ఉన్నా.. చెత్త వేసినా వెంటనే భూ య జమానులకు జరిమానా విధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. రాయికల్ పట్టణంలోని మూ డో వార్డులో మంగళవారం పారిశుధ్య పనులను పరిశీలించారు. మాదిగకుంటను పరిశీలించి నిల్వ ఉన్న నీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని ము న్సిపల్ అధికారులను ఆదేశించారు. ఇటిక్యాల గ్రా మంలో నిర్మాణంలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడీ కేంద్రం, జెడ్పీహెచ్‌ఎస్ భవనాలను పరి శీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు. ఆ యన వెంట ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాము, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, కౌన్సిలర్లు రాకేశ్‌నాయక్, పుర్రె శ్రీధర్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, ఇటిక్యాల సర్పంచ్ నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదవాలి
జగిత్యాల: పదో తరగతి విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా చదివి సమాధానాలు స్పష్టంగా.. క్రమబద్ధంగా రాయాలని కలెక్టర్ సత్యప్రసద్ అన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, అరగంట ముందే కేంద్రానికి చేరుకుంటే ఒత్తిడి ఉండదన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు.


