క్షయ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

క్షయ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి

Mar 11 2026 7:29 AM | Updated on Mar 11 2026 7:29 AM

మల్యాల: క్షయవ్యాధి నివారణలో అందరూ భాగస్వామ్యం కావాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డిజిటల్‌ మొబైల్‌ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించారు. క్షయ నిర్ధారణ శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. దగ్గు, జ్వరం ఉంటే తక్షణమే క్షయ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. మండల వైద్యాధికారి మౌనిక, సిబ్బంది రమేశ్‌, రాజమ్మ, శ్రీనివాస్‌, వికాస్‌, రాజీవ్‌ పాల్గొన్నారు.

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లావ్యాప్తంగా ఏప్రిల్‌ 9 వరకు పశువులకు గాలికుంటూ నివారణ టీకాలను ఉచితంగా వేయనున్నట్లు పశువైద్యాధికారి బొల్లం ప్రకాశ్‌ తెలిపారు. జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లిలో మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎద్దులు, ఆవులు, లేగదూడలు 32,534, బర్రెలు 85,200 ఉన్నాయని, వీటికి టీకాలు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కట్టా రాజేందర్‌, మండల పశువైద్యాధికారి గడ్డం నరేష్‌రెడ్డి, ఎల్‌ఎస్‌ఎలు పాల్గొన్నారు.

పెద్దాపూర్‌ మల్లన్న ఆలయ హుండీ లెక్కింపు

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో ఆదివారం జరిగిన మల్లన్న జాతర సందర్భంగా భక్తుల ద్వారా హుండీలకు రూ.14,03,544 సమకూరినట్లు ఆలయ ఈవో విక్రమ్‌ తెలిపారు. మిశ్రమ వెండి 560 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. పరిశీలకులు రాజమొగిలి, ఆలయ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, సర్పంచ్‌ సుమలత, ఉపసర్పంచ్‌ చిన్నమల్లేశ్‌, కేడీసీసీ బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఈవీఎంల గోదాం తనిఖీ

జగిత్యాల: ఈవీఎంల వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మంగళవారం ఈవీఎం గోదాంలను పరిశీలించారు. గోదాం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ లత, ఆర్డీవో మధుసూదన్‌, కలెక్టరేట్‌ ఏవో హకీం, అర్బన్‌ తహసీల్దార్‌ రామ్మోహన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement