తెలంగాణలో ఇచ్చేవి మోదీ బియ్యమే.. | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఇచ్చేవి మోదీ బియ్యమే..

Published Tue, Jun 13 2023 10:08 AM

- - Sakshi

మల్యాల(చొప్పదండి): ‘వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌’ ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు పంపిణీ చేసేవి కేసీఆర్‌ బియ్యం కాద ని.. నరేంద్రమోదీ బియ్యమన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు మోదీ ప్రభుత్వం ఉచితంగా బి య్యం పంపిణీ చేస్తోందని వెల్లడించారు. మోదీ దేశప్రజలే తన కుటుంబంగా భావిస్తారని తెలిపారు. సీ ఎం కేసీఆర్‌ తన కుటుంబమే పరీవారంగా భావిస్తారని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా మల్యా ల మండలం ముత్యంపేట రెడ్డిఫంక్షన్‌ హాల్‌లో సోమవారం మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా నిర్వహించిన సమావేశానికి ప్రకాశ్‌ జవదేకర్‌, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హాజరయ్యారు.

తొలు త మల్యాలలోని రేషన్‌ దుకాణాన్ని సందర్శించి, బి య్యం తీసుకుంటున్న వృద్ధురాలితో మాట్లాడారు. బియ్యాన్ని డబ్బులు ఇస్తున్నావా? అని అడుగగా.. మూడేళ్లుగా పైసా ఇవ్వకుండా ప్రతినెలా 6 కిలోల బి య్యం తీసుకుంటున్నానని వృద్ధురాలు సమాధానం ఇచ్చింది. బియ్యం మూటగట్టి వృద్ధురాలి తలపై పెట్టిన ప్రకాశ్‌ జవదేకర్‌, బండి సంజయ్‌.. అనంత రం ముత్యంపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో లక్షలాది మందికి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా రూ.6వేల చొప్పున అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 11లక్షల మందికి ఉజ్వ ల పథకం కింద వంట గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేశామని చెప్పారు. 40 లక్షల మందికి ప్రధానమంత్రి జీవన్‌జీవన్‌ జ్యోతి బీమా అమలవుతోందని తెలి పారు.

మోదీ పథకాలతో లబ్ధిపొందిన వారంతా 89198 47687 ఫోన్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి, బీ జేపీకి మద్దతు ఇవ్వాలని వారు కోరారు. ప్రతీఒక్క కార్యకర్త మూడు కుటుంబాలను కలిసి, లబ్ధిదారుల వీడియోలు తీసి, సోషల్‌ మీడియాలో పోస్టు చేయాలని నిర్దేశించారు. పేదలతోపాటు కరీంనగర్‌ డెయిరీ కి నరేంద్రమోదీ రూ.10కోట్ల లబ్ధి చేకూర్చారని అ న్నారు. దేశవ్యాప్తంగా మోదీ ఉచితంగా కరోనా వ్యా క్సిన్‌ పంపిణీ చేశారని, కేసీఆర్‌ వ్యాక్సిన్‌ అంటే మ ద్యం అని ఎద్దేవా చేశారు.

మోదీ కేబినేట్‌లో ఏఒక్క మంత్రిపైనా అవినీతి ఆరోపణలు లేవని, కేసీఆర్‌ మంత్రివర్గంలో అవినీతి ఆరోపణలు లేనిమంత్రులు లేరన్నారు. 2024లో బీజేపీ 14 ఎంపీ సీట్లు గెలుసుకోవడం ఖాయమన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించి, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్‌ దానిని విస్మరించా రని విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనా రాయణరావు, నేరెళ్ల శ్రావణ్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement