ట్రంప్‌ మామలో కొత్తకోణం.. తన ఉద్యోగులకు! | Donald Trump Gifts $45000 Each To Three White House Aides For Holiday Trips, Check Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ మామలో కొత్తకోణం.. తన ఉద్యోగులకు!

Sep 9 2026 3:14 PM | Updated on Sep 9 2026 4:16 PM

world news trump gave cash gift to human printer aide

వాషింగ్టన్‌ డీసీ: డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పేరు వింటే చాలు... ఇరాన్‌పై దాడి.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం.. ప్రపంచ దేశాలపై అధిక పన్నులు ఇలా తలతిక్క నిర్ణయాలతో ఆయన చేసే పిచ్చిపనులే గుర్తొస్తాయి.. తనకు నచ్చిన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేసే ట్రంప్‌.. ఆయనలోనూ మానవత కోణం ఉందని నిరూపించారు. వైట్‌హౌస్‌లో పనిచేసే ఉద్యోగులకు హాలిడే ట్రిప్‌ నిమిత్తం కొంత నగదుని బహుమతిచ్చినట్లు వైట్‌హౌస్‌ కథనాలు పేర్కొన్నాయి.

డొనాల్డ్ ట్రంప్ తన కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్‌కు 45,000 డాలర్ల నగదు బహుమతిని అందజేశారని  అదే విధంగా  వైట్ హౌస్‌లోని మరో ఇద్దరు ఉద్యోగులైన మార్గో మార్టిన్,  ఛాంబర్‌లేన్ హారిస్ కూడా దాదాపు అంతే మొత్తంలో డబ్బు అందుకున్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది. ఆ ముగ్గురు మహిళలు ఆ డబ్బులను హాలిడే ట్రిప్‌ల నిమిత్తం ట్రంప్‌ గిప్ట్‌గా ఇ‍చ్చినట్లు  కథనం ప్రచురించింది.

ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక కార్యనిర్హాహక సహాయకురాలు హార్ప్ నిరంతరం ఆయన పక్కనే ఉంటూన్నారు, కొన్నిసార్లు ఆయన కోసం సోషల్ మీడియా పోస్టులను టైప్ చేయడం, సమాచారాన్ని ప్రింట్ చేయడం వంటి పనులు చేస్తూ వచ్చారు. ఈ పాత్ర కారణంగా ఆమెకు "హ్యూమన్ ప్రింటర్" అని వైట్‌ హౌస్‌ వర్గాలు పిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలో హాలిడే ట్రిప్‌ కోసం పెద్దమెుత్తంలో నగదు బహుమతి అందుకున్నారు.

ఉద్రిక్తంగా పశ్చిమాసియా యుద్ధం
కాగా ప్రసతుం అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. అమెరికా నౌకాదళానికి చెందిన యుద్ధనౌకపై ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (IRGC) వరుసగా రెండుసార్లు బాలిస్టిక్‌ క్షిపణులతో దాడికి ప్రయత్నించడంతో.. అమెరికా తీవ్రంగా స్పందించి ప్రతి దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన ఐదు ముడి చమురు రవాణా నౌకలను అమెరికా బలగాలు తాజాగా ధ్వంసం చేశాయని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ తెలిపింది.

గత రెండు రోజుల్లో అమెరికా నేవీ యుద్ధనౌకపై ఇరాన్‌ రెండుసార్లు క్షిపణి దాడికి ప్రయత్నించిందని CENTCOM తెలిపింది. అయితే రెండు దాడులను అమెరికా యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుని, ప్రాంతీయ జలాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందని పేర్కొంది. ఈ ఘటనల్లో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్‌ తాజా దాడి ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఐదు చమురు నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మరింతగా ముదిరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement