breaking news
humanitarian grounds
-
మళ్లీ.. దక్షిణాదికి వెళ్లిపోండి!
గాజా సిటీ: గాజా నగరాన్ని పూర్తి నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ఆర్మీ మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే నగరాన్ని యుద్ధ జోన్‌గాను, అందులోని కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగాను ప్రకటించింది. రెడ్ జోన్లలోని వారంతా ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తోంది. దక్షిణాదిన ఉన్న మువాసికి వెళ్లాలని, అక్కడ ఏర్పాటు చేసిన హ్యుమానిటేరియన్ ఏరియాలో తలదాచుకోవాలని ఆర్మీ ప్రతినిధి అవిచె ఆండ్రీ ఎక్స్‌లో కోరారు. హమాస్‌కు గట్టి పట్టున్న యుద్ధ క్షేత్రంగా మారినందున వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. నిర్దేశించిన మార్గంలో వెళితే ఎలాంటి తనిఖీలు ఉండవని చెప్పారు. హ్యుమానిటేరియన్ జోన్లో ఫీల్డ్ ఆస్పత్రులు, వాటర్ పైప్లైన్లు, ఆహారం, టెంట్లు ఉంటాయన్నారు. ఆర్మీ రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కనీసం 10 లక్షల మంది ఉంటున్నారు. వీరందరినీ ఖాళీ చేయించడం వల్ల మానవీయ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతుందని సహాయక సంస్థలు అంటున్నాయి. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న పోరు కారణంగా పాలస్తీనియన్లు పదేపదే ఉన్న చోటును వదిలి వేరే చోటును ఆశ్రయించాల్సి వచ్చింది. సరైన ఆహారం సైతం లభించని స్థితిలో బలహీనంగా, ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. ‘వాళ్లు మాకు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. మా పిల్లలతో కలిసి మేం ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? గాయపడిన వాళ్లు, జబ్బున పడిన వాళ్లు, ముసలి వాళ్లు ఉంటే వాళ్లని ఎక్కడికని తీసుకెళ్లాలి?’అని గాజా సిటీకి చెందిన ఉమ్ హైతమ్ ప్రశ్నించారు. తాజాగా, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించిన హ్యుమానిటేరియన్ జోన్ విషయంలో తమతో సంప్రదించలేదని ఐరాస ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రతినిధి ఒల్గా చెరెవ్కో అన్నారు. గతంలో మువాసి సహా పలు ప్రాంతాలను మానవతా జోన్లుగా ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ఆర్మీ వాటిపై దాడులకు దిగిందని గాజా ఆరోగ్య విభాగం అంటోంది. ఇలా ఉండగా, శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ నగరంలోని మరో రెండు బహుళ అంతస్తుల భవనాలకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం 12 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సేపటికే ఒక భవనాన్ని కూలి్చనట్లు మంత్రి ప్రకటించారు. ఆకాశ హర్మ్యాలను హమాస్ నిఘాకు వాడుకుంటోందన్నది ఆర్మీ ఆరోపణ. కాగా, హమాస్ తమ చెరలో ఉన్న ఇద్దరు ఇజ్రాయెల్ బందీల వీడియోలను తాజాగా విడుదల చేసింది. వీరిద్దరిని గై గిల్బోవా–దలాల్, అలొన్ ఒహెల్గా గుర్తించారు. వేలాదిగా ఆర్మీ సిబ్బందితో గాజాపై నియంత్రణకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలతో మిగతా బందీల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వారి కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. యుద్ధాన్ని ముగించి, బందీలను సురక్షితంగా విడిపించాలని వారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం వారు ట్రంప్ ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ను కలిశారు. -
మానవతా దృక్పథంతో చూడాలి
కొలంబో: శ్రీలంక జలాల్లోకి పొరపాటుగా ప్రవేశిస్తున్న భారత జాలర్ల అంశాన్ని మానవతా దృక్పథంతో చూడాలని.. అది వారి జీవనాధారానికి సంబంధించినదని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘేకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విజ్ఞప్తి చేశారు. ఇటలీ నావికులతో భారత జాలర్లను పోల్చడం సరికాదని స్పష్టం చేశారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ముందుగా అక్కడికి వెళ్లిన సుష్మ శనివారంవిక్రమసింఘేతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అయితే భారత జాలర్లు ఉత్తర లంక జాలర్ల జీవనోపాధికి గండి కొడుతున్నారని, లంక జలాల్లోకి ప్రవేశిస్తే కాల్చివేస్తామని ఇటీవల విక్రమ సింఘే చేసిన వ్యాఖ్యలపై సుష్మ ఈ సందర్భంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది జాలర్ల జీవనాధార విషయమని, మానవతా దృక్పథంతో చూడాలని ఆమె స్పష్టం చేశారు. భేటీ అనంతరం విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఈ విషయాన్ని విలేకరులకు వెల్లడించారు. కాగా శ్రీలంకలోని తమిళుల కూటమి ‘తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్ఏ)’ నేతలతో సుష్మ జరిపిన భేటీలోనూ భారత జాలర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. -
మోసం చేసిన మహిళపై జాలి చూపిన నటుడు అలీ..
హైదరాబాద్: హాస్యనటుడు అలీ ఔదార్యాన్ని ప్రదర్శించారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. ప్రస్తుతం తినడానికి తిండి కూడా లేనిస్థితిలో వృద్దాప్యంలో ఉన్న ఆమెపై కేసును వెనక్కి తీసుకున్నారు. జాతీయ లోక్‌అదాలత్ సందర్భంగా శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో పాల్గొని ఆ వృద్ధురాలిపై కేసు ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిపై సాంబశివరావు దంపతులు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.90 లక్షల రుణం తీసుకున్నారు. ఈ సంగతి చెప్పకుండానే ఇంటిని విక్రయించారు. బ్యాంకు అధికారుల ద్వారా ఆలస్యంగా ఆ విషయాన్ని తెలుసుకున్న అలీ... 2006లో వారిద్దరిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తతం నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తుది విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయమూర్తి ఎస్.ఎస్.శ్రీదేవి... శకుంతల దయనీయ పరిస్థితిని అలీకి వివరించారు. దీంతో కేసును ఉపసంహరించుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. లోక్ అదాలత్ లో నిందితుల నుంచి తమకు రావాల్సిన డబ్బు తీసుకొని కక్షిదారులు రాజీ అవుతుండగా..అలీ మాత్రం తనకు రావల్సిన డబ్బును వదులుకొని పెద్ద మనసుతో కేసును ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించిన అలీని న్యాయమూర్తులు అభినందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు ముందుకొచ్చి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు.