90 ఏళ్ల మృత్యుంజయురాలు | Woman in 90s pulled alive from rubble five days after Japan earthquake | Sakshi
Sakshi News home page

90 ఏళ్ల మృత్యుంజయురాలు

Jan 8 2024 6:10 AM | Updated on Jan 8 2024 6:10 AM

Woman in 90s pulled alive from rubble five days after Japan earthquake - Sakshi

టోక్యో: జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదం మిగిలి్చంది. వంద మందికిపైగా జనం మరణించారు. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. 90 ఏళ్లకుపైగా వయసున్న ఓ వృద్ధురాలు శిథిలాల నుంచి ప్రాణాలతో క్షేమంగా బయటపడడం ఆశ్చర్యం కలిగింది.

ఇషికావా జిల్లాలోని సుజు సిటీలో భూకంపం వల్ల కూలిపోయిన రెండంతస్తుల భవన శిథిలాలను తొలగిస్తుండగా ఆదివారం సాయంత్రం ఈ వృద్ధురాలు బయటకు వచి్చంది. ఆహారం, నీరు లేక బలహీనంగా మారిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స ప్రారంభించారు. ఏకంగా 124 గంటలపాటు ఆమె ఈ శిథిలాల కిందే ఉండిపోయింది. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, మాట్లాడగలుతోందని, ఆమె కాళ్లకు గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. జపాన్‌లో ఆరు రోజుల క్రితం సంభవించిన భూకంపంలో కనీసం 126 మంది మృత్యువాతపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
Advertisement