ఐవీఎఫ్‌ హార్మోన్ల బదులు అబార్షన్‌ బిళ్లలిచ్చారు!

US Woman Mistakenly Given Abortion Pills Instead Of IVF Hormones - Sakshi

న్యూయార్క్‌: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌లో సంతానం కోసం ఐవీఎఫ్‌ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్‌ అనే మహిళకు మెడికల్‌ షాపు ఐవీఎఫ్‌ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్‌ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్‌ షాప్‌పై ఆమె స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్‌లోని డాక్టర్‌ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది.

‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్‌ షాప్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్‌ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్‌ పద్ధతిని ఆశ్రయించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top