ఇరాన్‌తో జరుగుతున్న యుద్దంలో అమెరికా సైన్యం ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తి నష్టాన్ని కూడా ఎదుర్కొంటుంది. ఇందుకు సంబంధించిన తాజా నివేదికను యుఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. ఈ యుద్దంలో అమెరికా సైనికుల మరణాల సంఖ్య 14కు చేరింది.
జూలై 1న అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఒక అమెరికా నేవీ పైలట్ మరణించడంతో ఈ సంఖ్య పెరిగింది. అయితే ఈ ప్రమాదం శత్రువుల దాడి వల్ల జరగలేదని, సాంకేతిక కారణాల వల్ల అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడం వల్లే జరిగిందని పెంటగాన్ తెలిపింది.
అదేవిధంగా సోమవారం నాటికి గాయపడిన సైనికుల సంఖ్య 414కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ మాట్లాడుతూ... గాయపడిన వారిలో అత్యధిక శాతం మంది 'ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీస్' (మెదడుకు తీవ్రమైన గాయాలు) బారిన పడ్డారని పేర్కొన్నారు.


