సౌదీ అరేబియా విమానాశ్రయంపై హూతీల డ్రోన్ల దాడి | Houthis hit Abha airport after Saudi strike on Sanaa fuels escalation | Sakshi
Sakshi News home page

సౌదీ అరేబియా విమానాశ్రయంపై హూతీల డ్రోన్ల దాడి

Jul 14 2026 4:15 AM | Updated on Jul 14 2026 4:22 AM

Houthis hit Abha airport after Saudi strike on Sanaa fuels escalation

PC: X.com

యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సోమవారం సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే తాము ఈ దాడికి పాల్పడినట్లు హూతీ గ్రూప్ ప్రకటించింది.

కాగా ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. హూతీల దాడులపై సౌదీ అధికారులు వెంటనే స్పందించనప్పటికీ, ఆ తర్వాత సౌదీ కూటమి మాత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.  సౌదీ దక్షిణ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని హూతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు కూటమి తెలిపింది. ఈ సౌదీ కూటమి అనేది  2015లో యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై పోరాడటానికి సౌదీ అరేబియా నాయకత్వంలో ఏర్పడింది.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు  హూతీ ప్రతినిధి బృందం టెహ్రాన్‌కు వెళ్లింది. అంత్యక్రియల అనంతరం ఆ ప్రతినిధి బృందంతో తిరిగి వస్తున్న ఇరాన్ విమానాన్ని అడ్డుకునేందుకు సనా విమానాశ్రయం రన్‌వేపై సౌదీ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్ ప్రభుత్వం దాడి చేసింది.

ఈ విషయాన్ని యెమెన్ రక్షణ మంత్రి జనరల్ తాహెర్ అల్-అఖిలి సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇందుకు ప్రతీకారంగా సౌదీలోని అభా ఎయిర్‌పోర్ట్‌పై హూతీలు దాడి చేశారు. సనా విమానాశ్రయంపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే వరకు విమానయాన సంస్థలు సౌదీ వైమానిక పరిధిలోకి రావొద్దు. ఈ హెచ్చరికను తీవ్రంగా పరిగణించాలి" అని హూతీ బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా హూతీలకు ఇరాన్ సపోర్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement