నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే..

Tourists Missing After Boat Bursts Into Flames Off Egypt Coast - Sakshi

ఈజిప్టు: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టు, ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 

మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే..సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే అందమైన ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top