బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! | Job That Pays Up To Rs 1 Crore To Only Replace Lightbulbs Of Signal Towers | Sakshi
Sakshi News home page

బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..!

Jun 11 2023 7:42 PM | Updated on Jun 11 2023 8:27 PM

Job That Pays Up To Rs 1 Crore To Only Replace Lightbulbs Of Signal Towers - Sakshi

జీవితాన్ని సౌకర్యవంతంగా గడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఏ ఉద్యోగం చేసినా పదో పాతికో సంపాదించగలం. బాగా శ్రమిస్తే కొందరైతే లక్షల వరకు చేరుకోగలరు. కానీ కేవలం బల్బులను మార్చుతూ కోట్లు సంపాదించగలరా? ఏ సంస్థ అయినా లైట్లు మార్చితే కోట్ల రూపాయల జీతం ఇస్తుందా? అవును ఇస్తుంది. కేవలం టవర్‌కు ఉండే లైట్లను మార్చితే కోట్ల రూపాయల జీతం సంపాదించవచ్చు. కాకపోతే.. ఆ టవర్ల ఎత్తు మామూలుగా ఉండదు మరి..!

మామూలు టవర్లు కావు..
వందల మీటర్లు ఉండే ఎత్తైన సిగ్నల్ టవర్లపై పని చేయాలి. పైకి వెళ్లగానే కళ్లు తిరుగకుండా, ధైర్యంగా సన్నని కడ్డీలపై తిరుగాల్సి ఉంటుంది. బయట కనిపించే టవర్ల లాంటివి కావు ఇవి. ఎత్తుకు పోయేకొలది సన్నగా ఉంటాయి. చివరకు కేవలం సన్నని కడ్డీ మాత్రమే ఉంటుంది. ఈ టవర్లపై ఎక్కి లైట్లను మార్చాలి అంటే..భయంతో కూడిన పని. కేవలం ఒక తాడు మాత్రమే రక్షణగా ఉంటుంది. ఇలాంటి పనులు అందరూ చేయలేరు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శారీరకంగా దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి టవర్లపై పనిచేయగలిగే వారికి చాలా డిమాండ్ అంటుందట. 

కోట్లలో జీతాలు..
టవర్ ఎత్తు, అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగికి జీతం ఉంటుందట. కొందరికి గంటల చొప్పున ఉంటుంది. ఎంత తక్కువలో అయినా ఒక టవర్ ఎక్కి దిగడానికి కనీసం ఆరుగంటలైన పడుతుంది. 1500 మీటర్ల టవర్‌ను ఎక్కగలిగేవారికి దాదాపు 1 కోటి రూపాయలపైనే ఉంటుంది. ఉద్యోగంలో కొత్తగా చేరినవారికే గంటకు సరాసరిగా 17డాలర్ల వరకు ఇస్తారు. అయితే.. ప్రతీ ఆరునెలలకు ఒకసారి ఈ లైట్లను మారుస్తారట. అమెరికాలోని డకోటా నగరానికి చెందిన ఓ ట్విట్టర్ ఖాతాలో దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.

ఇదీ చదవండి:యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement