
ఎనిమిదో కేంద్ర వేతన సంఘం (సీపీసీ) అమల్లోకి రావడంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అధికారికంగా 8వ సీపీసీ 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నప్పటికీ, కమిషన్ ఏర్పాటులో పాలనాపరమైన జాప్యం వల్ల 2027 ప్రారంభం వరకు వాయిదా పడే అవకాశం ఉందనే వాదనలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.
ఇదీ చదవండి: గొడుగుల తయారీలో ఆత్మనిర్భర్ భారత్
కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్‌పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్‌పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది. 8వ సీపీపీకి మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ 1.92 మరింత కన్జర్వేటివ్ ఫ్యాక్టగా ఉండే అవకాశం ఉందని సూచించారు.
లెవల్ 1 ఉద్యోగుల వేతనాల్లో మార్పులు ఇలా..(అంచనా)
ప్రస్తుతం 7వ సీపీసీ | 8వ సీపీసీ(అంచనా) | |
బేసిక్ పే | రూ.18,000 | రూ.34,560 |
డియర్నెస్ అలవెన్స్ (57%) | రూ.10,260 | రూ.19,699 |
ఇంటి అద్దె భత్యం (24%) | రూ.4,320 | రూ.2,765 |
రవాణా భత్యం | రూ.1,350 | రూ.1,350 |
స్థూల వేతనం | రూ.40,930 | రూ.58,374 |
ఎన్‌పీఎస్ డిడక్షన్ | రూ.2,880 | రూ.5,426 |
సీజీహెచ్‌ఎస్ డిడక్షన్ | రూ.196 | రూ.250 |
నికర వేతనం | రూ.37,854 | రూ.52,898 |
పెరిగే అవకాశం ఇలా.. | - | నెలకు రూ.15,044 (+39.74%) |
గమనిక: 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరగనుంది. నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ, టీఏ గణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి.