రూమ్‌లో వెస్టర్న్‌ టాయిలెట్‌.. ఐఆర్‌సీటీసీకి జరిమానా! | Booked Indian Got Western Man Wins Compensation Over IRCTC Room | Sakshi
Sakshi News home page

రూమ్‌లో వెస్టర్న్‌ టాయిలెట్‌.. ఐఆర్‌సీటీసీకి రూ.20 వేల జరిమానా!

Oct 16 2026 4:30 PM | Updated on Oct 16 2026 4:58 PM

Booked Indian Got Western Man Wins Compensation Over IRCTC Room

అధికారికంగా నమోదు చేసిన సేవలకు, వాస్తవ సదుపాయాలకు తేడా ఉంటే వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని చండీగఢ్ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ స్పష్టం చేసింది. ఐఆర్‌సీటీసీ (IRCTC) పోర్టల్‌లో చూపించిన సదుపాయాలు వాస్తవంలో లభించకపోవడంతో దాఖలైన పిటిషన్‌ను విచారించిన కమిషన్, బాధితుడికి రూ.20,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

అసలేం జరిగింది?

చండీగఢ్‌కు చెందిన 72 ఏళ్ల భారతేందు సూద్ మే 2024లో చిత్తోర్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో రూ.333 చెల్లించి ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకున్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా వెస్ట్రన్ టాయిలెట్ ఉన్న గదిని ఎంచుకున్నారు. అయితే, అక్కడికి చేరుకున్నాక ఆ గదిలో ఇండియన్ టాయిలెట్ ఉండటంతో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. దీంతో ఆ గదిని ఉపయోగించకుండానే తాళాలను అధికారులకు అప్పగించి రిఫండ్ కోరారు. కానీ, రైల్వే అధికారులు రిఫండ్ ఇచ్చేందుకు నిరాకరించారు.

వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు

సేవా లోపం, అనుచిత వ్యాపార ధోరణిపై సూద్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించారు. తొలుత జిల్లా ఫోరం రూ.3,333 (రూ.333 రీఫండ్ + రూ.3,000 పరిహారం) ఇవ్వాలని తీర్పునిచ్చింది. అయితే ఈ పరిహారం తన మానసిక వేదనకు, న్యాయపోరాటానికి అయిన ఖర్చులకు సరిపోదని భావించిన సూద్ స్టేట్ కమిషన్‌లో అప్పీల్ చేశారు.

స్టేట్ కమిషన్ తీర్పు

పద్మా పాండే, రాజేష్ కుమార్ ఆర్యలతో కూడిన స్టేట్ కమిషన్ ధర్మాసనం జిల్లా ఫోరం ఇచ్చిన రూ.3,000 పరిహారం కేవలం ‘టోకెన్’ ప్రాతిపదికన మాత్రమే ఉందంటూ, దాన్ని రూ.20,000లకు పెంచింది. వినియోగదారుడికి జరిగిన మానసిక వేదన, సమయం వృథా కావడం, సేవా లోపాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మొత్తం బుకింగ్ సొమ్ము రూ.333 ను 9% వడ్డీతో రీఫండ్ చేయాలని, 30 రోజుల్లోగా రూ.20,000 పరిహారాన్ని చెల్లించాలని ఐఆర్‌సీటీసీ, రైల్వే శాఖలను కమిషన్ ఆదేశించింది. నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే వడ్డీ రేటును 12 శాతానికి పెంచుతామని హెచ్చరించింది.

ఇదీ చదవండి: రోజూ చూసే రూపీ సింబల్ వెనుక దాగున్న రహస్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement