స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి | Three dead, several injured in shooting at Christian school in Wisconsin | Sakshi
Sakshi News home page

స్కూల్లో కాల్పులు.. ముగ్గురు మృతి

Dec 17 2024 3:26 AM | Updated on Dec 17 2024 3:26 AM

Three dead, several injured in shooting at Christian school in Wisconsin

అమెరికాలో ఉన్మాది ఘాతుకం మృతుల్లో ఉన్మాది? 

మాడిసన్‌: అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని సోమవారం ఒక స్కూలులో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో కాల్పులకు తెగబడ్డ ఉన్మాది కూడా ఉన్నట్లు సమాచారం. మాడిసన్‌లోని అబుండంట్‌ లైఫ్‌ క్రిస్టియన్‌ స్కూల్‌లో ఈ దుర్ఘటన జరిగింది. 

కాల్పులకు తెగబడిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా? వారు క్రియాశీలకంగా ఉన్నారా? ఆయుధాలతో ఉన్నారా? అనేది పోలీసులు ధ్రువీకరించునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ స్కూలులో కిండర్‌ గార్డెన్‌ నుంచి పదో తరగతి దాకా మొత్తం 390 మంది చదువుతున్నట్లు పాఠశాల వెబ్‌సైట్లో ఉంది. ఇతర అత్యవసర విభాగాలకు చెందిన అధికారులు కూడా రంగంలోకి దిగి స్థానిక యంత్రాంగానికి అండగా నిలిచారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement