బీబీసీ, సీఎన్‌ఎన్, హెచ్‌ఎస్‌బీసీ..178 సంస్థలపై భారీ సైబర్‌ దాడి | BBC CNN HSBC Zoom among 178 organisations hit by malware Report URI | Sakshi
Sakshi News home page

బీబీసీ, సీఎన్‌ఎన్, హెచ్‌ఎస్‌బీసీ..178 సంస్థలపై భారీ సైబర్‌ దాడి

Nov 17 2026 1:22 PM | Updated on Nov 17 2026 1:25 PM

BBC CNN HSBC Zoom among 178 organisations hit by malware Report URI

 ప్రముఖ వెబ్‌సైట్లపై భారీ సైబర్‌ దాడి  కలకలం రేపుతోంది.  హ్యాకింగ్,  డిజిటల్  గ్లిచెస్‌, భారీ సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయి. జేపీమోర్గాన్ చేజ్ , వెల్స్ ఫార్గో వంటి సంస్థల ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను  మాలావేర్‌ ప్రభావితం చేసిన  కొద్ది రోజులకే, 178 సంస్థలు మాల్‌వేర్ బారిన పడ్డాయని వెబ్ సెక్యూరిటీ సంస్థ రిపోర్ట్ యూఆర్ఐ పేర్కొంది. ఆర్థిక సమాచారాన్ని చోరీతోపాటు, దుర్బలమైన (vulnerable) ఆపిల్ పరికరాలను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించిన హానికరమైన స్క్రిప్ట్‌ల ద్వారా ఈ దాడి జరిగిందని వెల్లడించింది. 

ఈ  మాలావేర్‌ వెబ్‌సైట్‌లలో నమోదు చేసిన క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, సెక్యూరిటీ కోడ్‌లను సేకరించగలదు, క్రిప్టోకరెన్సీ వాలెట్ చిరునామాలను హ్యాకర్ల నియంత్రణలో ఉన్న వాటితో భర్తీ చేయగలదు, అలాగే బ్రౌజర్ కుకీలు , స్క్రీన్‌షాట్‌లను సేకరించగలదు. ప్రభావితమైన సంస్థలలో  బీబీసీ (BBC), సీఎన్‌ఎన్ (CNN), జూమ్ (Zoom) , హెచ్‌ఎస్‌బీసీ (HSBC) సేల్స్‌ఫోర్స్, గిట్‌ల్యాబ్, ఐకియా,  ఈక్విఫాక్స్, ఎయిర్ ఫ్రాన్స్-కేఎల్ఎం, లెడ్జర్,  పీకాక్ వంటి ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే  178 సంస్థలకు చెందిన వెబ్‌సైట్‌లు ఈ సైబర్ దాడికి గురయ్యాయి.

లాంకషైర్‌కు చెందిన యూఆర్ఐ ప్రకారం, నవంబర్ 16, 2026న, ఆప్టిమైజ్లీ (Optimizely Web)  వెబ్ ప్రయోగాత్మక ప్లాట్‌ఫామ్ ద్వారా 178 సంస్థల సందర్శకులకు హానికరమైన జావాస్క్రిప్ట్ పంపబడింది. 'రిపోర్ట్ URI'కి చెందిన భద్రతా పరిశోధకుడు స్కాట్ హెల్మ్ (Scott Helme) 1,611 స్క్రిప్ట్‌లను పరిశీలించి, ఆ 178 సంస్థలకు చెందిన 188 సోకిన (infected) జావాస్క్రిప్ట్ ఫైళ్లను గుర్తించారు.  

అలాగే, బలహీన ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లను లక్ష్యంగా 'కోరుణా' (Coruna), 'డార్క్‌సోర్డ్' (DarkSword) ఎక్స్‌ప్లాయిట్ కిట్‌లను చేర వేయడానికి రూపొందించిన కోడ్‌ను కూడా పరిశోధకులు కనుగొన్నారు. ఈ దాడిలో బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం అత్యధికంగా ప్రభావితమై (32 సంస్థలు),ప్రథమ స్థానంలో ఉండగా   ఆ తర్వాత సాంకేతిక (టెక్నాలజీ) సాఫ్ట్‌వేర్ సేవల రంగం 23 సంస్థలతో రెండో స్థానంలో ఉంది . 

ఇదీ చదవండి: 77 ఏళ్ల గంగా బాబా గుట్టురట్టు : ఏడు రోజులు నరక యాతన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement