ఇంటర్వ్యూ స్లాట్ల కోసం చెక్‌ చేసుకోండి | Student Visas Leaves Aspirants In A Flux, US Embassy Warns Indian Students | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూ స్లాట్ల కోసం చెక్‌ చేసుకోండి

May 31 2025 5:12 AM | Updated on May 31 2025 5:12 AM

Student Visas Leaves Aspirants In A Flux, US Embassy Warns Indian Students

న్యూయార్క్‌: అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసు కున్న విదేశీ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్వ్యూ స్లాట్లు తాత్కాలికంగా నిలిపివేసింది. 

అయితే, స్లాట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉందని, అందుకోసం తరచుగా తనిఖీ చేసుకోవాలని విదేశీ విద్యార్థులకు ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా సూచించింది. ఇంటర్వ్యూ స్లాట్లు ఎప్పుడు మొదలవుతాయో కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. స్లాట్ల కోసం ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవడం మంచిదని తెలియజేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement