ఇరాన్‌తో యుద్ధం ముగిసిందనే అనుకుంటున్నా | Donald Trump calls Iran war effectively over militarily | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో యుద్ధం ముగిసిందనే అనుకుంటున్నా

Nov 11 2026 5:51 AM | Updated on Nov 11 2026 5:51 AM

Donald Trump calls Iran war effectively over militarily

ఖతార్‌ ప్రధానితో భేటీ అనంతరం ట్రంప్‌ వ్యాఖ్య 

వాషింగ్టన్‌: ఇరాన్‌తో యుద్ధం సైనికపరంగా ప్రభావవంతంగానే ముగిసిందని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పటికైతే తిరిగి ఇరాన్‌పై బాంబులు వేసేందుకు తాను సిద్ధంగా లేనని చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటోందని మీడియాతో అన్నారు. అంతకుముందు ఆయన ఖతార్‌ ప్రధాని షేక్‌ మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహా్మన్‌ బిన్‌ జస్సిమ్‌ అల్‌ థానీతో వైట్‌హౌస్‌లో చర్చలు జరిపారు.

 తమ దాడులతో ఇరాన్‌ మిలటరీపరంగా బలహీనపడిందని, ఇప్పటి పరిస్థితినే కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. ఇరాన్‌ ఓడ రేవుల దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. అయితే, ఇరాన్‌ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేసే శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఇరాన్‌పై దాడులు తప్పవంటూ పదేపదే హెచ్చరికలు చేసిన ట్రంప్‌..మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత ఇవ్వడం గమనార్హం. 

కాగా, ట్రంప్‌ అంతకుముందు తన సొంత ట్రూత్‌ సోషల్‌లో..‘పశి్చమాసియా మిత్ర దేశాలైన ఖతార్, సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్‌ తదితర దేశాలు ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని కోరుకుంటున్నాయి. అదేవిధంగా, యుద్ధంతో అలసిపోయిన అమెరికన్లకు భరోసా ఇస్తూ, పరిస్థితుల్లో సానుకూలమైన మార్పు కనిపిస్తోంది. యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశముంది’అని పేర్కొన్నారు. 

అయితే, ఇరాన్‌ పోర్టుల దిగ్బంధనానికి మోహరించిన బలగాల ఉపసంహరణ, ఇరాన్‌ చమురు ప్రపంచ మార్కెట్లలోకి అందుబాటులోకి తేవడం, ఇరాన్‌పై అడపాదడపా జరుపుతున్న దాడుల నిలిపివేత వంటి చర్యల విషయం ఆయన ప్రస్తావించలేదు. కాగా, ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఖతార్‌ గతవారం తీసుకువచ్చిన రెండు ప్రతిపాదనలపై సోమవారం ఆ దేశ ప్రధానితో ట్రంప్‌ చర్చలు జరిపినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement