హెగ్సెత్‌కు అభిశంసన ముప్పు  | Thomas Massie files articles of impeachment against Defense Secretary Pete Hegseth | Sakshi
Sakshi News home page

హెగ్సెత్‌కు అభిశంసన ముప్పు 

Nov 11 2026 6:24 AM | Updated on Nov 11 2026 6:24 AM

Thomas Massie files articles of impeachment against Defense Secretary Pete Hegseth

కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన సొంత రిపబ్లికన్‌ థామస్‌ మస్సీ 

ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు ట్రంప్‌ 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో అత్యంత కీలక నేత, రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌కు పదవీ గండం వచ్చిపడింది. ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీ అనూహ్యంగా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధమే ఈ ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదే పార్టీకి చెందిన సభ్యుడు థామస్‌ మస్సీ సోమవారం కాంగ్రెస్‌లో హెగ్సెత్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఇరాన్‌ యుద్ధంతోపాటు యెమెన్, వెనెజువెలా దేశాల్లో చేపట్టిన సైనిక జోక్యాల్లో హెగ్సెత్‌ పాత్రను కూడా తీర్మానంలో ప్రశ్నించారు. హెగ్సెత్‌ చర్యలను ఆయన ఘోర నేరాలు, దు్రష్పవర్తనగా అభివరి్ణంచారు. హెగ్సెత్‌ ఉద్దేశపూర్వకంగానే తన చట్ట వ్యతిరేక చర్యల ద్వారా రాజ్యాంగానికి ముప్పుగా పరిణమించారని ఆరోపించారు. మధ్యంతర ఎన్నికల తర్వాత సోమవారం మొదలైన సెషన్‌ మొదటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. అవిశ్వాస తీర్మానంపై అధ్యక్షుడు ట్రంప్‌ మండిపడ్డారు. గతంలో తాను బలపరిచిన వ్యక్తి చేతిలో ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి పాలైన థామస్‌ మస్సీ విద్వేషంతోనే ఇందుకు పూనుకున్నారని విమర్శించారు.

కాగా, తీర్మానంపై ప్రతినిధుల సభలో ఈ వారంలోనే ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది, తదుపరి పరిణామాలపై మాత్రం స్పష్టత లేదు. సభలో డెమొక్రటిక్‌ పార్టీ నేత హకీమ్‌ జెఫ్రీస్‌ ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. మెజారిటీ డెమొక్రాట్లు ఆయన్ను అనుసరిస్తే, హెగ్సెత్‌ అభిశంసనకు కొద్దిమంది రిపబ్లికన్ల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రతినిధుల సభతోపాటు సెనేట్‌లో ప్రస్తుతానికి రిపబ్లికన్లదే మెజారిటీ. ఇటీవలి మధ్యతర ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన వారంతా జనవరిలో సమావేశమైన తర్వాతే ఉభయసభల్లోనూ డెమొక్రాట్లదే పైచేయి అవుతుంది. ఇలా ఉండగా, పార్టీ ఎజెండాను అమలు చేసేందుకు మరికొద్ది వారాల సమయం మాత్రమే మిగిలి ఉండగా, సొంత పార్టీ నేత తీసుకువచ్చిన అభిశంసనపై రిపబ్లికన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

అమెరికా చరిత్రలోనే లేదు: హెగ్సెత్‌ 
తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ మంత్రి హెగ్సెత్‌ తెలిపారు. రాజ్యాంగ రూపకర్తలు ఉద్దేశించిన తీవ్రమైన నేరాల కింద కాకుండా, కేవలం విధానపరమైన విభేదాలతోనే ఒక రోగ్‌ తనను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. దాదాపు ఆరు నెలల తర్వాత హెగ్సెత్‌ మంగళవారం పెంటగాన్‌లో మీడియాతో మాట్లాడారు. అమెరికా 250 ఏళ్ల చరిత్రలో చట్టబద్ధమైన సైనిక చర్యలను అమలు చేసినందుకు గాను దేశ రక్షణ మంత్రిని అభిశంసించిన దాఖలాలు లేనేలేవన్నారు. ‘విధానపరమైన విభేదాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు చాలా మంది ప్రయతి్నస్తున్నారు. కానీ, వారి అసలైన సమస్య మాత్రం మేం సాధించిన విజయాలే’అని హెగ్సెత్‌ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న సైనిక చర్యలపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తనపై వచ్చిన అభిశంసనకు కేవలం వ్యక్తిగత విద్వేష రాజకీయాలే కారణమని, అది తనపై పనిచేయదని స్పష్టం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement