breaking news
Slot
-
అమ్మో.. అమెరికా వీసా
సాక్షి, హైదరాబాద్: యూఎస్ వీసాలు అందక అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యార్థి వీసాల జారీలో యూఎస్ ముప్పు తిప్పలు పెడుతోంది. కొన్ని యూనివర్సిటీలు ఒక వైపున ఐ–20 జారీ చేయడం లేదు. మరోవైపు సెప్టెంబర్ 15లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇంకోవైపు వర్సిటీల నుంచి ఐ–20 లెటర్లు వచి్చన 70 వేల మంది విద్యార్థులకు ఇంత వరకూ వీసా స్లాట్లు బుక్ అవ్వలేదని ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. స్లాట్లు ఇచ్చి వీసాకు పిలిచినా చిన్నచిన్న కారణాలతోనే వీసా తిరస్కరిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. భారత్ నుంచి ఏటా 3.20 లక్షల మంది అమెరికా వెళ్తుంటారు. వీరిలో 1.90 వేల మంది విదేశీ విద్య కోసం వెళ్లేవారే. ఈ సెప్టెంబర్ నుంచి అమెరికాలో ఫాల్ సీజన్ మొదలవుతుంది. ఆగస్టు నుంచే అక్కడ వర్సిటీలు ప్రవేశాలు మొదలుపెడతాయి. విద్యార్థులు ఆరు నెలల ముందే వీసా కోసం సిద్ధమవుతుంటారు. ఎందుకీ పరిస్థితి? విద్య కోసం వెళ్లే విద్యార్థులకు అమెరికా ఎఫ్–1 వీసా ఇస్తుంది. ఇది పొందాలంటే ముందుగా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. వర్సిటీలపై అమెరికా ప్రభుత్వం రెండేళ్లుగా నిఘా పెంచింది. సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చింది. విద్యార్థి నేపథ్యం తెలియకుండా ప్రవేశం కలి్పంచినా, ఆ విద్యార్థి అమెరికా దృష్టిలో చెప్పబడే అసాంఘిక శక్తులతో సంబంధం ఉన్నట్టు తేలినా వర్సిటీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతోపాటే చదవు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండే గ్రేస్ పీరియడ్‌ను 60 నుంచి 30 రోజులకు తగ్గించింది.నాలుగేళ్ల పీహెచ్డీ కోర్సుకు అదనపు అనుమతులు కావాలనే షరతు పెట్టారు. పీహెచ్డీ అనుకున్న కాల వ్యవధిలో పూర్తి చేస్తామనే భరోసా తీసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో వర్సిటీలు కూడా జాగ్రత్త పడాల్సి వస్తోంది. విద్యార్థులకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే ఐ–20 పత్రాలు ఇస్తున్నాయి. వీసాలకు ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు వర్సిటీల ప్రవేశాలపై కూడా ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి. వీసా దగ్గర తిప్పలే స్టూడెంట్ వీసా తీసుకోవడం కష్టంగానే మారింది. ఐదేళ్లుగా విద్యార్థి ఉపయోగించిన సాషల్ ఖాతాలను ఇమ్మిగ్రేషన్ పరిశీలిస్తోంది. కొన్ని సందర్భాల్లో పబ్లిక్‌గా కనిపించే పోస్టులపైనా వాకబు చేస్తున్నారు. గతంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. ఇలాంటి విద్యార్థులకు వర్సిటీలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అనుమతించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనికి వర్సిటీలు భయపడుతున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థి ఎలాంటి చర్యలకు పాల్పడినా వర్సిటీలే బాధ్యత వహించాలనే నిబంధన తెచ్చారు.దీంతో వర్సిటీలు వెనక్కి తగ్గుతున్నాయి. వీసా సమయంలో ఆర్థిక పత్రాలన్నీ పరిశీలించడానికి ఎక్కువ సమయం పడుతోంది. ప్రతీ విద్యార్థి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడంతో వీసా స్లాట్ల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో చదువుకునే సమయం, ఆ తర్వాత గ్రేస్ పీరియడ్‌లో నివసించడానికి అవసరమైన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో విద్యార్థులు చూపిస్తారు. ఈ మొత్తం ఎక్కడ్నుంచీ వచి్చందనేది లోతుగా పరిశీలించిన తర్వాతే వీసాలు ఇస్తున్నారు. మరోవైపు విద్యార్థి ఇంటర్వ్యూ సమయంలో ఏమాత్రం సరైన సమాధానం ఇవ్వలేదని భావించినా వీసా తిరస్కరిస్తున్నారు. అన్నీ పంపాం.. ఇంకా లెటర్ ఇవ్వలేదు ఎంఎస్ కోసం యూఎస్ వెళ్లాలని ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నా. వీసాకు దరఖాస్తు చేశాను. వర్సిటీ ఇంకా ఐ–20 లెటర్ ఇవ్వలేదు. వారిని మెయిల్లో సంప్రదిస్తే ఇంకా పరిశీలనలో ఉందంటున్నారు. సెపె్టంబర్ నుంచే అకడమిక్ ఈయర్ మొదలువుతంది. ఆగస్టులో వెళ్తే తప్ప మేం అక్కడ అన్ని ఏర్పాట్లూ చూసుకోలేం. – వీసం పల్లవి, హైదరాబాద్ రోజుకో సమాచారం అడుగుతున్నారు అమెరికా యూనివర్సిటీ లెటర్ కూడా వచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు రోజుకో లెటర్ అడుగుతున్నారు. సోషల్ ప్లాట్‌ఫాంలో పెట్టిన సాధారణ పోస్టులపైనా వివరాలు ఇవ్వమన్నారు. బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు, మాకు అప్పు ఇచి్చన వారి వివరాలు కోరారు. వారి బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ అడిగారు. అప్పు ఇచ్చిన వారు భయపడుతున్నారు. అసలు అమెరికా వెళ్లగలమా? లేదా? అనే ఆందోళనలో ఉన్నాం. – మహ్మద్ షరీఫ్, వరంగల్ -
ఇంటర్వ్యూ స్లాట్ల కోసం చెక్ చేసుకోండి
న్యూయార్క్: అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసు కున్న విదేశీ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్వ్యూ స్లాట్లు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, స్లాట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉందని, అందుకోసం తరచుగా తనిఖీ చేసుకోవాలని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం తాజాగా సూచించింది. ఇంటర్వ్యూ స్లాట్లు ఎప్పుడు మొదలవుతాయో కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. స్లాట్ల కోసం ఆన్లైన్లో చెక్ చేసుకోవడం మంచిదని తెలియజేసింది. -
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలుగంటున్న భారతీ య విద్యార్థులకు మరిన్ని షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్లు ఆన్లైన్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 20–25 రోజుల నుంచి వీసా అపాయింట్మెంట్ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి వేలాది మంది విద్యార్థులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సీజన్ డెడ్‌లైన్‌కు గడువు ముంచుకొస్తోంది. నిర్దేశిత గడువులోగా వీసాలు దొరక్కపోతే అడ్మిషన్‌పై ప్రభావం పడనుంది. అమెరికా వీసా కావాలంటే ఇండియాలోని యూఎస్ ఎంబసీలు లేదా కాన్సులేట్లలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల కోసం ముందుగానే ఆన్లైన్లో నగదు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన స్లాట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మే, జూన్‌కు సంబంధించిన స్లాట్లు అందుబాటులో లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. కారణం ఏమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్ల కోసం నిత్యం వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. కానీ, నిరాశే ఎదురవుతోంది. అమెరికా ఎంబసీ వీసా స్లాట్ల వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోందని, అందుకే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీసా స్లాట్ల వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయకుండా, అనధికారిక వ్యక్తులు ఇందులోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు వీసాలు దొరకడం కష్టం కావడంతో అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు వాయిదా వేసుకోవాలని కొందరు విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిసింది.భారతీయ విద్యార్థులకు సహకరిస్తాం: రణధీర్ జైశ్వాల్ అమెరికాలో భారతీయుల వీసాలు హఠాత్తుగా రద్దు చేస్తుండడం, భారతీయ పర్యాటకులను అడ్డుకోవడం, హెచ్–1బీ వీసా ఉన్నవారికి ప్రవేశం నిరాకరిస్తుండడం వంటి సమస్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు. ఎఫ్–1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఎంబీసీలు, కాన్సులేట్లు మన విద్యార్థులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. -
వారంలోనే పాస్‌పోర్ట్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత వారం రోజులలోపే స్లాట్ లభించేలా చర్యలు చేపట్టామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీఓ) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చే సుకొన్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని చెప్పా రు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కోవిడ్ అనంతరం పాస్‌పోర్ట్ స్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో స్లాట్ కోసం 30 నుంచి 40 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రస్తుతం దీనిని గరిష్టంగా 8 పని దినాలకు తగ్గించాం. 2025లో వారం రోజుల్లోనే స్లాట్ దొరికేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’అని వివరించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్‌పోర్ట్ ఎన్వలప్ కవర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఆదిలాబాద్, కామారెడ్డిలో మరుసటి రోజే స్లాట్.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే) ఉన్నాయని స్నేహజ తెలిపారు. పీఓపీఎస్కేల్లోనూ వారం రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతోందని చెప్పారు. ఆదిలాబాద్, కామారెడ్డి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని వెల్లడించారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత పోలీసు వెరిఫికేషన్‌కు పట్టే సమయాన్ని మినహాయించి తత్కాల్ పాస్‌పోర్టును ఒకటి నుంచి మూడు పని దినాలు, సాధారణ పాస్‌పోర్టును ఐదు నుంచి ఏడు పనిదినాల్లో జారీ చేస్తున్నాం’అని వివరించారు.సందేహాల నివృత్తికి వాట్సాప్ నంబర్దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించడానికి సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పబ్లిక్ డేలు నిర్వహిస్తున్నామని స్నేహజ తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా రావచ్చని, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నవాళ్లు సోమ, మంగళ, శుక్రవారాల్లో రావాలని సూచించారు. ఈ రెండు రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ–మెయిల్, ఎక్స్, వాట్సాప్, ఫోన్‌కాల్స్ ద్వారానూ అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ‘81214 01532’వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామని తెలిపారు. రెండేళ్లకు మించి శిక్షపడితే పాస్‌పోర్ట్ ఇవ్వం..పాస్‌పోర్ట్ పొందడానికి కనిష్ట, గరిష్ట వయో పరిమితులు లేవని స్నేహజ తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో ప్రతికూల అంశాలు తెలిసినా, దరఖాస్తుదారుడికి ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్షపడినా పాస్‌పోర్ట్ జారీ చేయబోమని చెప్పారు. అలాంటివారికి కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తామని పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్ మైనర్ల విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరి నుంచి అనుమతి చాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.‘పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న వాళ్లు ఆ దరఖాస్తుతో ఎఫ్ఐఆర్ కాపీని జత చేయక్కర్లేదు. మీ–సేవా కేంద్రం నుంచి తీసుకున్న ‘లాస్ట్’ సర్టీఫికెట్ ఇస్తే సరిపోతుంది. వివాహానంతరం ఇంటి పేరు మారిన మహిళలు తాజా అడ్రస్ ప్రూఫ్‌తో డాక్యుమెంట్లు ఇస్తే చాలు. మ్యారేజ్ సర్టీఫికెట్ తప్పనిసరి కాదు’అని పేర్కొన్నారు. బ్రాంచ్ సెక్రటేరియేట్ నుంచి గత ఏడాది 1,400 సర్టీఫికెట్ల అటెస్టేషన్ లేదా అపోస్టల్ చేశామని వివరించారు.‘పాస్‌పోర్టు’ సమస్యలు..సందేహాలా?89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి.. పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ సమాధానాలిస్తారుపాస్పోర్టు కోసమే కాకుండా.. అది వచ్చిన తర్వాత కూడా ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్కే), పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే), వెబ్సైట్ లాంటివి ఉన్నా సామాన్యుడికి ఇప్పటికీ అనేక సందేహాలు, సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక అంశాలు అర్థంకాక ఇప్పటికీ పలువురు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కేవలం రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం జారీ చేసే పాస్‌పోర్టు విషయంలోనే కాదు.. దీనికి అనుబంధంగా ఉండే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రాంచ్ సెక్రటేరియెట్ అందించే అటెస్టేష¯న్ అండ్ అపోస్టల్ సేవల పైనా పలు సందేహాలు ఉంటున్నాయి. ఈ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు ముందుకు వచ్చింది ‘మీతో సాక్షి’. మీ వివరాలు, సమస్య, సందేహాన్ని 89777–94588 నంబర్‌కు టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌ల రూపంలో వాట్సాప్ చేయండి. ‘మీతో సాక్షి’ వీటిని రీజనల్ పాస్‌పోర్టు అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ దృష్టికి తీసుకెళుతుంది. మీ సందేహాలు, సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యలు, సందేహాలు వెంటనే తెలియజేయండి. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టీఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్నవారికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. గత ఏడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ జిల్లాలో అయినా స్లాట్ బుకింగ్ చేసుకుని స్క్రీనింగ్‌కు హాజరయ్యే అవకాశం కల్పించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. దీంతో అప్పట్లో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను కూడా 173కు పెంచింది. 2022–23 సంవత్సరంలో 96,439 మందికి సదరం సర్టిఫికెట్లను ఇచ్చింది. -
సదరం స్లాట్ల విడుదల
సాక్షి, అమరావతి: దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థులు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్లాట్లు బుక్ చేసుకున్న వారికి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థోపెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ధ్రువీకరణపత్రాలు అందజేస్తారు. గతేడాది జూలై నుంచి స్థానికతతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో అయిన స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు ఏ జిల్లాలో అయినా స్క్రీనింగ్ పరీక్షలకు హాజరుకావొచ్చు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సులభతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను సులభతరం చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మొక్కుబడిగా 56 ఆస్పత్రుల్లోనే సదరం క్యాంపులు నిర్వహించేవారు. అప్పట్లో సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోనే స్లాట్ బుకింగ్‌లకు అవకాశం కల్పించింది. ఆస్పత్రుల సంఖ్యను 173కి పెంచింది. దీంతో టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రజలకు ఇప్పుడు సులభంగా సదరం సేవలు లభిస్తున్నాయి. నాడు ఏడాదికి 25వేల నుంచి 30 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా, ప్రస్తుతం ఏడాదికి అంతకన్నా మూడు రెట్లు అధికంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. 2022–23 సంవత్సరంలో 2.99 లక్షల స్లాట్లను ప్రభుత్వం విడుదల చేయగా, 2.25 లక్షల స్లాట్లు బుక్ అయ్యాయి. సందరం క్యాంప్‌లకు హాజరైన వారికి స్క్రీనింగ్ నిర్వహించి 96,439 సర్టిఫికెట్లను మంజూరు చేశారు. -
పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్లను 50 శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలు సూపర్ స్పైడర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ నెల 31 వరకు 50 శాతం అపాయింట్మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. నిలిపివేసిన అపాయింట్మెంట్లలో మెడికల్, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలో సంప్రదిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) -
ఓటు వేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి!
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో పోలింగ్ స్టేషన్ల ముందు చాంతాడంత లైన్లు! వరుసలో నిరీక్షించే ఓపిక లేక కొందరు ఆ బారులను చూసే వెనక్కి వెళ్లిపోతుంటారు. అలాగాకుండా ఓటుకు స్లాట్‌ను బుక్ చేసుకొని మనకు కుదిరిన టైంలో వెళ్లి ఓటేస్తే? ఎన్నికల సంఘం ఆలోచన కార్యరూపం దాలిస్తే ఇది నిజం కానుంది. ‘ఈ విధానంతో ఓటర్లు బారులను తప్పించుకోవచ్చు. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. పోలింగ్ సమయాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ సౌకర్యం కల్పించడంపై యోచిస్తున్నాం’ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్ సిన్హా గురువారమిక్కడ తెలిపారు.


