పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఈరీలో శుక్రవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని గవర్నర్ జోష్ షపిరో శనివారం తెలిపారు. తన 28 ఏళ్ల సర్వీసులో ఇంత దారుణమైన కాల్పుల ఘటనను ఎన్నడూ చూడలేదని పోలీస్ చీఫ్ రిక్ లోరాహ్ చెప్పారు.
సమాచారం అందుకున్న పోలీసులు కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి బయట ఆ ఇద్దరు మహిళలు అప్పటికే మృతిచెంది ఉన్నారు. అనంతరం డ్రోన్, రోబో సహాయంతో పరిస్థితిని పరిశీలించి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు. మొదటి అంతస్తులో ఐదేళ్ల బాలుడు, ఏడాది వయసున్న చిన్నారి మృతదేహాలను గుర్తించారు. మెట్ల మార్గంలో మరో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించాయి. రెండో అంతస్తులో నిందితుడు మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు.
మృతుల ఇతర కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు, ఇంటి బయట హత్యకు గురైన మహిళల సెల్‌ఫోన్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. ఆ మహిళలకు ఇంట్లో ఏదో జరుగుతోందని ముందే తెలిసి ఉండవచ్చని.. ఈ ఘటనపై విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రియాద్ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి.. 12 మంది మృతి!


