రష్యా, ఉక్రెయిన్‌ పరస్పర దాడులు.. 10 మంది మృతి | Russian and Ukrainian Cross-Border Strikes Kill 10, Over 30 Injured | Sakshi
Sakshi News home page

రష్యా, ఉక్రెయిన్‌ పరస్పర దాడులు.. 10 మంది మృతి

Aug 5 2026 5:47 AM | Updated on Aug 5 2026 9:48 AM

Russian and Ukrainian strikes kill at least 10

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ పరస్పరం జరుపుకున్న దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్‌ జరిపిన డ్రోన్‌ దాడుల్లో ఐదుగురు చనిపోగా 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని మరో వైల్డ్‌బెర్రీస్‌ గోదాముపై దాడి చేయగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌లోని మైకోలైవ్, పివ్‌డెన్యి, ఒడెసా పోర్టులపై దాడి చేసి చమురు, ఆయుధాలు, సైనిక సామగ్రితో వెళ్తున్న నాలుగు నౌకలను ధ్వంసం చేశామంది. రష్యా దాడుల్లో మైకోలైవ్‌ ఒకరు, సుమీలో ఇద్దరు బాలికలు, ఒక వృద్ధురాలు, ఖర్కీవ్‌లో మరొకరు చనిపోయారు. అదేవిధంగా, క్రమటోర్‌స్క్‌లో రష్యా జరిపిన గ్లైడ్‌ బాంబుల దాడిలో మరో 22 మంది గాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement