అమెరికాతో మాకేంటి.. ఇరాన్‌ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు | PM Benjamin Netanyahu Sensational Comments | Sakshi
Sakshi News home page

అమెరికాతో మాకేంటి.. ఇరాన్‌ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు

Jun 20 2025 1:07 PM | Updated on Jun 20 2025 1:11 PM

PM Benjamin Netanyahu Sensational Comments

టెలీ అవీవ్‌: ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్‌ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్‌ చేశారు.

తాజాగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్‌లో ఫోర్డ్‌లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్‌ న్యూక్లియర్‌ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్‌లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్‌లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.

మరోవైపు.. ఇరాన్‌ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్‌ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement