benjamin netanyhu
-
ఇక అణ్వాయుధాల జోలే లేదు.. నెతన్యాహు
టెల్ అవీవ్: ప్రస్తుతం పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. అమెరికా,ఇరాన్‌ల మధ్య డీల్ కుదరడంతో ఇరు దేశాలు యుద్ధానికి ముగింపు పలికాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగే ఉండే అవకాశం లేదన్నారు. అది ఈ రోజైనా..రేపైనా అని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంపై ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అసంతృప్తి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఆ దేశ ప్రజలకు వివరణ ఇచ్చారు. ఇరాన్‌పై యుద్ధం విషయంలో తాను చేసింది సరైందేనని సమర్థిస్తూ మాట్లాడారు. "మనం ఏమి సాధించామని ప్రజలు నన్ను అడుగుతున్నారు? దానికి నేను సమాధానమిస్తాను - మనం ఏమి సాధించాం? మనపై ఉన్న తక్షణ వినాశన ముప్పును మనం తొలగించుకున్నాం. అన్నింటికన్నా ముఖ్యంగా, ఇజ్రాయెల్ రాజ్యాన్ని సంపూర్ణ వినాశనం ముప్పు నుండి కాపాడాం" అని అన్నారు. శత్రుదేశం ఇరాన్‌కు ఈ రోజే కాదు రేపు.. ఎప్పుడూ అణ్వాయుధాలు ఉండవు. అని నెతన్యాహు పేర్కొన్నారు.తాము ఇజ్రాయెల్ దేశం చుట్టూ పటిష్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేశామని. గాజా, లెబనాన్ మరియు సిరియాలలో కూడా మేము ఇదే చేశామని అన్నారు. తాను ఒక నేను ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నానని ఇజ్రాయెల్‌కు అవసరమైనంత కాలం తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం మేము ఈ భద్రతా మండలాల్లోనే ఉంటామని నెతన్యాహూ తేల్చి చెప్పారు.ట్రంప్‌తో విభేదాలుఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో గల విభేదాలపై స్పందించారు. కొన్నిసార్లు అధ్యక్షుడు ట్రంప్‌కు, నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను వివేకంతో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అని అన్నారు.నెతన్యాహుపై విమర్శలుఇజ్రాయెల్లో నెతన్యాహు నాయకత్వాన్ని విమర్శిస్తూ విపక్ష నేత నఫ్తాలి బెన్నెట్ మాట్లాడారు. నెతన్యాహూ అధికారం అంతర్యుద్ధంతో ప్రారంభమై, అక్టోబర్ 7 నాటి మారణకాండతో కొనసాగి, ఇప్పుడు ఇరాన్‌పై చారిత్రాత్మక వైఫల్యంతో ముగుస్తోంది అని విమర్శించారు. ఈ వ్యతిరేకతల నేపథ్యంలో నెతన్యాహూ వివరణ ఇచ్చారు.ఎట్టకేలకు శాంతి ఒప్పందంకాగా గత మూడు నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ముగింపు లభించింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. -
అమెరికాతో మాకేంటి.. ఇరాన్ సంగతి మేమే తేలుస్తాం: నెతన్యాహు
టెలీ అవీవ్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందన్నారు. న్యూక్లియర్ స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా ఆదేశాల కోసం వేచి చూడలేము అంటూ కామెంట్స్ చేశారు.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు మాట్లాడుతూ..‘ఇరాన్‌పై దాడిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) చేరాలనుకుంటున్నారా లేదా అనేది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయమే. ఇరాన్లో ఫోర్డ్‌లోని భూగర్భ అణు కేంద్రంతో సహా ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్లో అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు ఉంది. ఇందుకు అమెరికా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనేమీ లేదు. ఇప్పటివరకు నిర్వహించిన దాడుల విషయంలో కూడా యూఎస్ ఆదేశాల కోసం వేచి చూడలేదు. ఇరాన్లో పరిపాలనను పతనం చేసే ఉద్దేశం మాకు లేదు. అది పూర్తిగా ఆ దేశ ప్రజలకు సంబంధించిన విషయం’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇరాన్‌పై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్‌తో కలవాలని అటు అమెరికా అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే విషయంలో ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. -
ఇజ్రాయెల్ కొత్త యుద్ధ లక్ష్యాల ప్రకటన
గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మంగళవారం నూతన యుద్ధ లక్ష్యాలతో ముందుకు సాగుతామని ప్రకటిటిచారు. ‘‘రాజకీయ భద్రతా కేబినెట్ యుద్ధం లక్ష్యాలను నవీకరించింది. క్రాస్ బార్డర్లో హమాస్ అనుకూల మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లాతో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పారిపోయిన ఉత్తరాది నివాసితులను సురక్షితంగా తిరిగి ఇజ్రాయెల్‌లోకి తీసుకొస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.మరోవైపు.. గాజా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరితే కట్టుబడి ఉంటామని హిజ్బుల్లా ప్రతినిధులు తెలిపారు. అయితే లెబనాన్ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో మిలిటెంట్లను తాము అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఈ దాడుల్లో లెబనాన్‌కు చెందిన వందల ఫైటర్లు, ఇజ్రాయెల్ దేశానికి చెందిన పౌరులు, సైనికులు మరణించారు. ఈ దాడుల కారణంగా ఇరుదేశాలకు సంబంధించి సుమారు పదివేల మంది పౌరులు వలసవెళ్లారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ఇజ్రాయెల్‌ను సందర్శించిన అమెరికా రాయబారితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఉత్తర నివవాసితులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకురావడానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం సైనిక చర్య మాత్రమేనని అన్నారు. రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.చదవండి: భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు -
వ్యూహాత్మక బంధం!
సిక్కిం సమీపంలోని సరిహద్దుల్లో చైనాతో మనకేర్పడ్డ వివాదం ముదురుతున్న తరుణంలో భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న చిరకాల చెలిమి ‘వ్యూహాత్మక భాగ స్వామ్యం’లోకి ప్రవేశించింది. దౌత్య పరిభాషలో ‘వ్యూహాత్మక భాగస్వామ్యా’నికి విస్తృతార్ధం ఉంటుంది. మన దేశానికి ఇలాంటి సంబంధాలు చాలా తక్కువ దేశాలతో–అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా వగైరాలతో ఉన్నాయి. ఇరు దేశా ల్లోనూ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఇక వెనక్కు వెళ్లలేనంతగా ఈ సంబంధాలు పెనవేసుకుంటాయి. ఇవి ఆర్ధిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాలకు విస్తరిస్తాయి. అందుకే ప్రధాని నరేంద్రమోదీతో బుధవారం రెండు గంటలపాటు చర్చలు సాగిన తర్వాత మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తాజా బంధాన్ని ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’గా అభివర్ణించారు. అంతకుముందు రోజు ఈ ద్వైపాక్షిక బంధాన్ని ‘ఐ స్క్వేర్ టీ స్క్వేర్’(ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్) అని చమత్కరించారు. దేన్నయినా హత్తుకునేలా చెప్పే మోదీ దీన్ని ‘ఐ ఫర్ ఐ’(ఇండియా ఫర్ ఇజ్రాయెల్)గా వర్ణించి ఆ పదబంధానికుండే ‘కంటికి కన్ను’ అర్ధాన్నే మార్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన మొద లుకొని వ్యవసాయం, జల సంరక్షణ వగైరాల వరకూ ఏడు ప్రధానాంశాలున్నా రక్షణ, భద్రత అత్యంత కీలకం కాబోతున్నదని ఇరు దేశాల సంయుక్త ప్రకటన తెలియజెబుతోంది. ఈ ప్రకటన బహురూపాల్లో, వ్యక్తీకరణల్లో ఉండే ఉగ్రవాదాన్ని ఖండించడంతోనే సరిపెట్టలేదు. ఉగ్రవాదానికి, ఉగ్రవాద ముఠాలకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు, ఆశ్రయం కల్పించేవారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించింది. భాగస్వాములు కాదల్చుకున్న దేశాలు ఈ స్థాయిలో దృఢంగా తనతో ఉండాలని మన దేశం ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ విష యంలో ఇజ్రాయెల్ ముందున్నట్టయింది. ఇజ్రాయెల్ మనతో పోలిస్తే చిన్న దేశమే కావొచ్చుగానీ... ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో దానికున్న అనుభవం అంతా ఇంతా కాదు. దానితో వ్యవహరించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అభి వృద్ధిలో కూడా ఆ దేశానికి పేరుప్రఖ్యాతులున్నాయి. భారత గడ్డపై జరిగే ఉగ్రవాద చర్యలన్నిటి మూలాలూ పాకిస్తాన్లో ఉన్నాయని మన దేశం తరచు చెబుతుంటుంది. కొన్ని ఘటనలకు సంబంధించి కీలకమైన సాక్ష్యాధారాలను కూడా వెల్లడించింది. అయినా అమెరికా మొదలుకొని చాలా దేశాలు పరోక్షంగా విమర్శిం చడమే తప్ప నేరుగా పేరెట్టి మీ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారిందని పాకిస్తాన్‌కు ఎప్పుడూ చెప్పలేదు. ఆ విషయంలో ఇజ్రాయెల్ ఎలాంటి తడు ములాట లేకుండా గట్టిగా ఖండిస్తుందని ఈ సంయుక్త ప్రకటన స్పష్టం చేస్తున్నది. అయితే మనం కూడా ఆ స్థాయిలోనే స్పందించాల్సివస్తుంది. పాలస్తీనా సంస్థల కార్యకలాపాలు హింసాత్మక రూపం తీసుకున్నప్పుడు మన దేశం కటువైన భాష ఉపయోగించేది కాదు. సమస్య పరిష్కారానికి అన్ని పక్షాలూ శాంతి యుతంగా కృషి చేయాలని సూచించేది. ఇకపై మన ధోరణి కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. నరేంద్రమోదీ తాజా పర్యటన ఇజ్రాయెల్‌తో మనకున్న సంబంధాలను పున ర్నిర్వచించింది. ఇజ్రాయెల్ అనుసరిస్తున్న విధానాన్ని ఒకప్పుడు యూదు మత వాదంగా, జాత్యహంకారంతో సమం చేస్తూ అంతర్జాతీయ వేదికలపై మాట్లాడిన మన దేశం ఇప్పుడు దాన్ని పూర్తిగా విడనాడిందని ఆయన పర్యటన స్పష్టం చేసింది. కొన్ని దశాబ్దాలుగా భారత్ అలా అంటున్నా ఇజ్రాయెల్ ఏనాడూ నొచ్చు కోలేదు. మనతో ఉన్న సంబంధాలపై ఆ ప్రభావం పడనీయలేదు. మోదీకి స్వాగతం చెప్పిన సందర్భంగా హత్తుకున్న నెతన్యాహూ ఈ రోజు కోసం ఇజ్రాయెల్ ఏడు దశాబ్దాలుగా వేచి చూస్తున్నదని చెప్పడాన్నిబట్టే భారత్‌తో సాన్నిహిత్యం కోసం ఆ దేశం ఎంత తహతహలాడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి నరేంద్ర మోదీ కూడా ఆ స్థాయిలోనే ఇజ్రాయెల్ పట్ల తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ మంత్రుల హోదాలో ఆ దేశం వెళ్లిన ఎల్కే అద్వానీ మొదలుకొని సుష్మా స్వరాజ్ వరకూ నేతలందరూ తప్పనిసరిగా పక్కనున్న పాల స్తీనా కూడా వెళ్లేవారు. ఆ దేశం మనసు కష్టపెట్టుకుంటుందన్న భావమే ఇందుకు కారణం. కానీ నరేంద్రమోదీ ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. అయితే అంతర్జాతీయంగానూ, పశ్చిమాసియాలోనూ మారిన పరిస్థితుల నేప థ్యంలో ఒకరితో స్నేహసంబంధాలు ఏర్పడినంత మాత్రాన వేరొకరితో అవి నిలిచిపోతాయనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఇన్నేళ్లుగా మన దేశం అరబ్బు దేశాలతో చెలిమి చేస్తున్నా అవి కశ్మీర్ విషయంలో పాకిస్తాన్నే బహి రంగంగా సమర్ధిస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్‌తో మన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నా ఆ దేశం కశ్మీర్ వివాదంలో ఎప్పుడూ మనల్నే సమర్ధించింది. అరబ్బు దేశాలతో మన వాణిజ్యం 2016–17లో 12,000 కోట్ల డాలర్ల మేర ఉంది. ఇందులో 5,000 కోట్ల డాలర్లు ఎగుమతులు, 7,000 కోట్లు దిగుమతులు ఉంటాయని ఒక అంచనా. అదే ఇజ్రాయెల్‌తో చూస్తే ఆ వాణిజ్యం మొత్తం 500 కోట్ల డాలర్లు మాత్రమే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఇజ్రాయెల్‌తో మనకున్న ఆయుధ కొనుగోళ్లు 117 శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ రష్యాయే మన ప్రధాన అమ్మకందారు. ఖతార్‌తో కలహం వచ్చాక అరబ్బు దేశాల శిబిరం సమైక్యంగా లేదు. మోదీ ఈ రెండేళ్లలోనూ పశ్చిమాసియాలోని దేశాలన్నీ పర్యటించారు. ఇన్నాళ్లకు ఇజ్రాయెల్‌ను ఎంచుకున్నారు. ఉగ్రవాదంపై మన దేశం చేసే పోరు భవిష్యత్తులో కొత్త రూపు సంతరించుకుంటుందని ఈ పర్యటన తేటతెల్లం చేసింది. ఉగ్రవాదంపై అంత ర్జాతీయ ఒడంబడిక కోసం రెండు దశాబ్దాలుగా సాగుతున్న చర్చలు ఆ పదానికివ్వాల్సిన నిర్వచనం దగ్గరే కొట్టుమిట్టాడుతున్న తరుణంలో... ఇజ్రా యెల్‌తో మనకేర్పడిన తాజా బంధం దానికి కొత్త ఊపునిస్తుందని... వ్యవసాయ, జల సంరక్షణ విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని చెప్పవచ్చు.


