Philippine Passenger Boat Carrying Dozens of People Killed - Sakshi
Sakshi News home page

పడవ మునక.. 21 మంది మృతి

Jul 28 2023 5:53 AM | Updated on Jul 28 2023 7:10 PM

Philippine passenger boat carrying dozens of people Killed - Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్‌ ప్రావిన్స్‌ బినంగోనన్‌ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటన సమయంలో పడవలో ప్రయాణికులెందరున్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. గాలులు బలంగా వీస్తుండటంతో ప్రయాణికులంతా పడవలో ఒకే వైపునకు చేరడంతో ప్రమాదం జరిగిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement